గీతం మెడికల్ కాలేజీలో మెడికో విద్యార్థి ఆత్మహత్య

గీతం మెడికల్ కాలేజీలో మెడికో విద్యార్థి ఆత్మహత్య

విశాఖపట్నం (Visakhapatnam)లో గీతం క‌ళాశాల‌ (Geetam College)లో మెడికో విద్యార్థి (Medico Student) ఆత్మ‌హ‌త్య (Suicide)  తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని చంబా జిల్లాకు చెందిన విస్మాద్ సింగ్ (Vismad Singh) (20) అనే మెడికల్ విద్యార్థి కళాశాల భవనం పై అంతస్తు నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘటన విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేపింది. విస్మాద్ సింగ్ ఆత్మహత్యకు ర్యాగింగ్ (Ragging) కారణమని ఆరోపణ‌లు వినిపిస్తున్నాయి. కాగా, విస్మాద్‌ సింగ్ మృతికి ర్యాగింగ్ కార‌ణ‌మా.. లేక చ‌దువుల్లో మాన‌సిక ఒత్తిడికి గుర‌య్యాడా..? లేదా ఇత‌ర వ్య‌క్తిగ‌త అంశాలేమైనా ఉన్నాయా..? అనే వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఇక కొద్ది రోజుల క్రితం కూడా గీతం విద్యాసంస్థలో చదువుతున్న మరో విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం గమనార్హం. వరుస సంఘటనలతో గీతం కళాశాలలో ఏం జ‌రుగుతుంద‌నే అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన‌ట్లుగా స‌మాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment