భారత్-పాక్ మ్యాచ్‌పై ‘బాయ్‌కాట్’ వివాదం.. వెనక్కి తగ్గిన బీసీసీఐ?

భారత్-పాక్ మ్యాచ్‌పై ‘బాయ్‌కాట్’ వివాదం.. వెనక్కి తగ్గిన బీసీసీఐ?

ఆసియా కప్ (Asia Cup) 2025లో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య జరగనున్న మ్యాచ్‌పై అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల పహల్గాం (Pahalgam) వద్ద జరిగిన ఉగ్రదాడి (Terror Attack) నేపథ్యంలో, ఈ మ్యాచ్‌ను రద్దు (Match Cancel) చేయాలని భారతీయ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ ఆసియా కప్ 2025’ (Boycott Asia Cup 2025), ‘బాయ్‌కాట్ ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్’ (Boycott India vs Pakistan Match) అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

అభిమానుల ఆగ్రహం కారణంగా బీసీసీఐ(BCCI) ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా భారత్-పాక్ మ్యాచ్‌లకు బీసీసీఐ నుంచి పెద్ద ఎత్తున అధికారులు హాజరవుతారు. కానీ ఈసారి, ఈ వివాదం నేపథ్యంలో కేవలం ఒక ప్రతినిధిని మాత్రమే దుబాయ్‌ (Dubai)కు పంపించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత జూన్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ మ్యాచ్‌కు బీసీసీఐ పెద్దలతో పాటు రాష్ట్ర క్రికెట్ సంఘాల ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో, బీసీసీఐ ఈ మ్యాచ్‌పై మౌనం పాటిస్తూ, అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ కీలక మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇరు జట్లు తమ మొదటి మ్యాచ్‌లలో గెలిచాయి. అయితే, భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment