కలియుగ దైవం శ్రీవారి దర్శనానికి వెళ్లే మార్గంలోని ఓ ప్రకటన భక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. కొండపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే అలిపిరి (Alipiri) మెట్ల మార్గంలో నాన్-వెజ్ ఫుడ్ ప్రకటనలతో కూడిన బారికేడ్లు కనిపించడంతో భక్తులు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు నిత్యం నడిచే ఈ పవిత్ర దారిలో ఇలాంటి ప్రకటనలు దర్శనమివ్వడం అవమానకరమని భక్తులు మండిపడుతున్నారు.
విజిలెన్స్ అధికారులపై విమర్శలు
ఈ వ్యవహారంలో విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వెలుగుచూసిందని భక్తులు ఆరోపిస్తున్నారు. పవిత్రతను కాపాడాల్సిన మార్గంలో నాన్-వెజ్ ప్రకటనలు అనుమతించడం అసహనం కలిగించే అంశమని విమర్శిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని ఇలాంటి ప్రకటనలను తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.