‘అనంత’ సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అనంతపురం (Anantapur)లో జరిగిన ఎన్‌డీఏ బహిరంగ సభ(NDA Public Meeting)లో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. సూపర్ సిక్స్-సూపర్ హిట్(Super Six-Super Hit) అనే పేరుతో నిర్వహించిన ఈ సభలో రైతులు, మహిళలు, పేదల సంక్షేమంపై ఆయన మాట్లాడారు.

రైతులకు పూర్తి మద్దతు
యూరియా(Urea) కొరత (Shortage) రాకుండా చూసుకుంటామని చంద్రబాబు(Chandrababu) రైతులకు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో యూరియాను వెంటనే అందిస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి మూడు విడతల్లో రూ.20 వేలు ఇస్తామని, తొలి విడతగా ఇప్పటికే 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు జమ చేశామని తెలిపారు.

ఆటో మిత్ర కింద ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు ఆర్థిక సాయం చేస్తాం. ఎన్నికల్లో చెప్పాం.. ఎన్ని కష్టాలున్నా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇదీ పేదలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment