కుప్పంలో దారుణం.. ఆర్థిక ఇబ్బందుల‌తో కుటుంబ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

కుప్పంలో దారుణం.. ఆర్థిక ఇబ్బందుల‌తో కుటుంబ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

చిత్తూరు జిల్లా (Chittoor District) కుప్పం (Kuppam) మున్సిపాలిటీ (Municipality) ప‌రిధిలో ఘోరం జ‌రిగింది. కుప్పం కొత్తపేటకు చెందిన ఒక‌ కుటుంబం (Family) ఆర్థిక ఇబ్బందులు(Financial Troubles) తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి (Suicide-Attempt) పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలోని కెఆర్‌పి (KRP) ఆనకట్టపై నుంచి బుధ‌వారం ఉదయం శారదమ్మాళ్ (75), అల్లుడు లక్ష్మణమూర్తి (50), ఆయన భార్య జ్యోతి (45), కుమార్తె కీర్తిక (20) దూకారు. స‌మీపంలోని మ‌త్స్య‌కారులు గ‌మ‌నించి వారిని ర‌క్షించే ప్ర‌య‌త్నం చేయ‌గా, శారదమ్మాళ్, లక్ష్మణమూర్తి ఆనకట్టలోని నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోగా, జ్యోతి, కూతురు కీర్తికను మత్స్యకారులు రక్షించారు. ప్రస్తుతం ఈ ఇద్దరినీ కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా నలిగిపోతుండటమే ఆత్మహత్యాయత్నానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment