ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ విజ‌యం

భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్

భారత (India) ఉప రాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి (NDA Candidate ) సీపీ రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan) ఘన విజయం (Grand Victory) సాధించారు. ఇవాళ ఉద‌యం ప్ర‌ధాని ఓటుతో పోలింగ్ ప్రక్రియ ప్రారంభ‌మవ్వ‌గా, సాయంత్రం 5 గంట‌ల‌కు నిర్ణిత స‌మ‌యానికి పోలింగ్ ముగిసింది. అనంత‌రం ఓట్ల లెక్కింపు చేప‌ట్టగా, ఎన్డీఏ అభ్య‌ర్థి రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, ఇండియా కూటమి అభ్యర్థి జ‌స్టిస్‌ సుదర్శన్ రెడ్డి 300 ఓట్లకే పరిమితమయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే రాధాకృష్ణన్ విజయాన్ని సాధించారు.

వ‌యో భారం, అనారోగ్య స‌మ‌స్యల‌తో జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌ ఉప రాష్ట్రపతి ప‌ద‌వి నుంచి త‌ప్పుకోగా, ఖాళీ అయిన స్థానానికి ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ తరఫున మాజీ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను బరిలోకి దింపగా, ఇండియా కూటమి తెలుగువాడైన మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది.

ఈ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ నుంచి బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలు దూరంగా నిలిచాయి. అయితే పార్లమెంట్ సభ్యులు విస్తృతంగా పాల్గొనడంతో పోటీకి మంచి ప్రాధాన్యత లభించింది. చివరికి అధిక సంఖ్యలో ఓట్లు సాధించి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment