హైకోర్టు తీర్పు రేవంత్ స‌ర్కార్‌కు చెంప‌పెట్టు – కౌశిక్‌రెడ్డి

హైకోర్టు తీర్పు రేవంత్ స‌ర్కార్‌కు చెంప‌పెట్టు - కౌశిక్‌రెడ్డి

గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారిందని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్ర‌శ్నించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టులను అమ్ముకుంది అన్నారు. పోస్టులను అమ్మకానికి పెట్టిన చరిత్ర రేవంత్‌దేనని ఆరోపించారు.

“563 గ్రూప్-1 పోస్టులను సీఎం రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం స్కాం చేసిందని హైకోర్టు కూడా నమ్మింది. ఇది ఆరు నెలల క్రితమే మేము చెప్పాం. సీఎం రేవంత్ అడ్డంగా దొరికిపోయిన దొంగ” అని పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రేవంత్‌పై సీబీఐ విచారణ జరిపించాలని, దీనికి బీజేపీ నేత బండి సంజయ్ ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీ, కాంగ్రెస్ మధ్య తెలంగాణలో ర‌హ‌స్య బంధం నడుస్తోందని, గతంలో పేపర్ లీక్ కేసులో పోరాడిన బండి సంజయ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ చదివారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు వాయిదాలవుతున్నాయని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని కౌశిక్ రెడ్డి విమర్శించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment