ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (Government)లో కీలక పరిపాలన మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 11 మంది సీనియర్ ఐఏఎస్(IAS) అధికారులను (Officers) బదిలీ (Transfer) చేస్తూ సీఎస్ విజయానంద్ (CS Vijayanand) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పులతో పలు కీలక శాఖల్లో కొత్త అధికారుల నియామకం జరిగింది.
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)(TTD) ఈవో(EO)గా పనిచేస్తున్న శ్యామలారావు (Syamala Rao)కు కీలకమైన పోస్టింగ్ ఇచ్చారు. శ్యామలరావును జీఏడీ(GAD) ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. అదే విధంగా గతంలో టీటీడీ ఈవోగా సేవలందించిన అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) మళ్లీ అదే బాధ్యతలు స్వీకరించనున్నారు.
అలాగే, ముకేష్ కుమార్ (Mukesh Kumar) మీనా (Meena)ను ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. కృష్ణబాబును ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సౌరభ్ గౌర్‌ను మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
కాంతిలాల్ దండే అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీహెచ్ శ్రీధర్ మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్ను నియమించారు.
ఇక కార్మిక, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా శేషగిరిబాబు, రెవెన్యూ శాఖ (ఎండోమెంట్స్) కార్యదర్శిగా హరి జవహర్లాల్ నియామకం అయ్యారు. ఈ బదిలీలు, కొత్త నియామకాలు రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులకు దారితీయనున్నాయి.