పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానుల్లో ఉత్సాహం మరింత పెంచుతూ ‘ఓజీ’ (OG) సినిమా కోసం సంగీత దర్శకుడు తమన్ (Thaman) ఒక అదిరిపోయే మ్యూజికల్ అప్‌డేట్ ఇచ్చారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
సంగీతంపై ప్రత్యేక శ్రద్ధ
ఈ ప్రాజెక్ట్ కోసం తమన్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) కోసం జపాన్(Japan)కు చెందిన సాంప్రదాయ వాయిద్యం ‘కోటో’ (Koto)ను ఉపయోగించనున్నట్లు ఇదివరకే ఆయన వెల్లడించారు. తాజాగా లండన్(London)లోని స్టూడియోలో బీజీఎం రికార్డింగ్ ఫొటోలు, వీడియోలను తమన్ షేర్ చేశారు. ఈ స్కోర్ కోసం ఏకంగా 117 మంది సంగీత కళాకారులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. “ఈసారి సంగీతం అసలు వేరే లెవెల్‌లో ఉంటుంది” అని తమన్ హామీ ఇవ్వడంతో అభిమానుల ఆసక్తి రెట్టింపు అయింది.
సినిమా విశేషాలు
సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘ఓజాస్ గంభీర్’ (Ojas Gambhir) అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఇదివరకు ఆయన పోషించిన పాత్రలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా పరిచయం అవుతున్నారు. శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మాస్, యాక్షన్, ఎమోషన్ కలగలిసిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.