ఈ ఏడాది గణనాథుడి (Lord Ganesha) లడ్డూలు (Laddus) రికార్డ్ ధరలు నెలకొల్పుతున్నాయి. ఈ సంవత్సరం లడ్డూ వేలంపాటలు కోట్ల రూపాయలు దాటేస్తున్నాయి. రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో వినాయకుడి లడ్డూ కొత్త రికార్డును సృష్టించింది. తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గణపయ్య నిమజ్జనానికి సిద్ధమవుతుండగా, భక్తులు డప్పు చప్పుళ్లు, భజనలతో, శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే అందరి దృష్టినీ ఆకర్షించింది లడ్డూ వేలంపాట.
కోట్లు పలికిన గణేష్ లడ్డూ
కీర్తి రిచ్మండ్ విల్లాస్ (Keerthi Richmond Villas) (గండిపేట మండలం, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి)లో నిర్వహించిన ఉత్సవాల్లో గణేష్ లడ్డూ ఏకంగా రూ.2.31 కోట్లకు అమ్ముడైంది. గతేడాది 1.87 కోట్ల రూపాయల రికార్డును అధిగమిస్తూ ఈసారి మరింత ఎత్తుకు చేరింది. భక్తులు వినాయకుడి లడ్డూను ఇంటికి తీసుకెళ్లి పూజిస్తే ఐష్టైశ్వర్యాలు, సుఖశాంతులు కలుగుతాయని విశ్వసిస్తారు.








