ఉద్య‌మానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్

ఉద్య‌మానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్

తెలంగాణ (Telangana)లో రెండు రోజుల పాటు ధర్నాలకు పిలుపునిచ్చారు బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR). కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)పై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) సీబీఐ(CBI) విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఉదయం పార్టీ శ్రేణులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు వంటి రూపాల్లో నిరసనలకు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునివ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తమయ్యాయి.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై కుట్ర చేస్తున్నది. తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి, నదీ జలాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) కలిసి చేస్తున్న ఈ కుట్రలను మనం ఎదుర్కోవాలి. ఇది కేవలం కేసీఆర్(KCR) పైన జరుగుతున్న కుట్ర మాత్రమే కాదు, తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగం” అని ఆరోపించారు.

“కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించడం అంటే ప్రాజెక్టును పూర్తిగా మూసివేయడమే. నిన్నటి వరకు సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఒక్కరోజులోనే ఎందుకు మాట మార్చారు? దీని వెనుక ఉన్న శక్తులు, ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజేయాలి. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న నాటకం. సీబీఐకి ఇచ్చినా లేదా ఏ ఏజెన్సీకి ఇచ్చినా బీఆర్ఎస్‌ పార్టీ భయపడదు. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటాం. బెదిరింపులు, కేసులు మా పార్టీకి కొత్త కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలైనా, త్యాగాలైనా చేస్తాం” అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment