కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలో నెల్లూరు (Nellore) జిల్లాలో అనేక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయంటూ వైసీపీ(YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలపై హత్యాయత్నం అంటూ కేసులు నమోదు అవుతుండగా, టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), ప్రశాంతి రెడ్డి (Prasanthi Reddy), కావ్య కృష్ణారెడ్డి (Kavya Krishna Reddy)పై స్కెచ్‌లు వేస్తున్నారనే వార్తలు వస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే, హత్యా రాజకీయాలను వైసీపీ ఎప్పుడూ ప్రోత్సహించదని స్పష్టం చేశారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మొదట ఎమ్మెల్యే అవ్వడానికి మాజీ సీఎం వైఎస్ జగనే(YS Jagan) కారణమని గుర్తుచేశారు. “తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే పనులు కోటంరెడ్డి చేయకూడదు” అంటూ తీవ్రంగా విమర్శించారు. నెల్లూరులో రౌడీ షీటర్లను, గ్యాంగ్‌లను పెంచింది కోటంరెడ్డి కాదా? అని ప్రశ్నించారు. రౌడీషీటర్ (Rowdysheeter) శ్రీకాంత్ (Srikant) పెరోల్ (Parole) మంజూరు విషయంలో కోటంరెడ్డి పాత్ర ఉందని, ఆ విషయం నుండి బయటపడటానికి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రౌడీషీటర్ పెరోల్‌పై హోంమంత్రి (Home Minister) సంతకం పెట్టింది నిజం కాదా..? ఏమి తీసుకొని, ఎవరు ప్రలోభంతో హోంమంత్రి పెరోల్ అర్జీపై సైన్ చేసింది? పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వ పనితీరుపై కూడా గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, పోలీసులు వైఫల్యం చెందారని, నెల్లూరు ఎస్పీ అసమర్థుడని మండిపడ్డారు. పెరోల్ మంజూరు విషయం, హత్యాయత్నాలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు వెళ్లాలని సవాలు విసిరారు. వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరైంది కాదని హెచ్చరిస్తూ, సహించే పరిస్థితులు లేవని స్పష్టం చేశారు.