ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో దివ్యాంగుల పెన్షన్ల (Disabled Persons) కోత వివాదంపై రాజకీయ వేడి చెలరేగుతోంది. ఈ విషయంపై రాష్ట్ర మాజీ సీఎం (Former CM), వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. అర్హత ఉన్నా రీవెరిఫికేషన్ (Re-Verification) పేరుతో తమ పెన్షన్లను కట్ చేశారని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఆందోళన చేపట్టగా, కొందరు మనోవేదన భరించలేక గుండెపోటుతో, మరికొందరు ఉరివేసుకొని, పురుగుల మందు తాగి బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్లు కోత విధించిన చంద్రబాబు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ట్వీట్ చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) మానవత్వం (Humanity) లేకుండా వ్యవహరిస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. “చంద్రబాబు గారూ… మీ బతుకంతా (Entire Life) మోసమేనా(Fraud)? మీరు ఘరానా మోసగాడని 15 నెలల పాలనలో ప్రతిరోజూ రుజువవుతోంది” అని విమర్శించారు. ఎన్నికల ముందు పెన్షన్లలో ఎలాంటి కోతలు ఉండవని, మరింత పెంచుతామని చెప్పి ఇప్పుడు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పెన్షన్ల కోతల గణాంకాలు
జగన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2024 మార్చి నాటికి వైసీపీ పాలనలో పెన్షన్ల సంఖ్య 66,34,372 ఉంది. కానీ, 2025 ఆగస్టులో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు 62,19,472 మాత్రమే. అంటే, ఏకంగా 4,14,900 పెన్షన్లను కత్తిరించారని జగన్ ఆరోపించారు. కొత్త పెన్షన్ ఒకదీ మంజూరు కాలేదని జగన్ విమర్శించారు.
వికలాంగుల పట్ల అన్యాయం
దివ్యాంగులకు పెన్షన్ ఇస్తున్న విధానంలో చంద్రబాబు ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రీ-వెరిఫికేషన్ పేరుతో నరకయాతన పెడుతున్నారని, ప్రభుత్వ డాక్టర్లే ఇచ్చిన సర్టిఫికెట్లను ఇప్పుడు తప్పుడు పత్రాలుగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు. లంచాల కోసం డాక్టర్లు తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారన్న ప్రచారం చేయడం దారుణమని, దివ్యాంగులను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం బలవన్మరణాలకు దారి తీస్తుందని జగన్ హెచ్చరించారు. “ఇది మోసం కాదా? ఇది దగా కాదా? బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ!” అని ట్వీట్ ముగించారు.
.@ncbn గారూ… మీ బతుకంతా మోసమేనా? మీరొక ఘరానా మోసగాడని ఈ 15 నెలల పరిపాలనా కాలంలో ప్రతిరోజూ రుజువవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధికారంలోకి వస్తే జగన్ ఇస్తున్న పథకాలేకాదు, అంతకుమించి ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అన్నారు, సూపర్… pic.twitter.com/VUKFqePO92
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2025