నేటి నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నేటి నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

కూటమి ప్రభుత్వం (Coalition Government) నేడు రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్ట‌నుంది. ఇకపై పాత రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ కార్డులు అందించనున్నారు. ఈ పథకం ద్వారా రేషన్ సరఫరా మరింత పారదర్శకంగా, సులభంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మొదటి విడతలో తొమ్మిది జిల్లాల్లో ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ ఈస్ట్‌లోని వరలక్ష్మీనగర్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరులో పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి 45 లక్షల మందికి నాలుగు విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయనున్నారు. మొదటి విడతలో విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. రెండో విడత ఈనెల 30 నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరులో ప్రారంభమవుతుంది. మూడో విడత వచ్చే నెల 6 నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో జరగనుంది. నాలుగో విడత వచ్చే నెల 15 నుంచి బాపట్ల, పల్నాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో అమలు చేయనున్నారు. గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా ఈ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Join WhatsApp

Join Now

Leave a Comment