భారత (India) క్రికెట్ జట్టు (Cricket Team) కెప్టెన్ (Captain) రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులు, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న ‘హిట్‌మ్యాన్’, ఆస్ట్రేలియా (Australia)తో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు బరిలోకి దిగనున్నాడు. బంగ్లాదేశ్‌తో జరగాల్సిన సిరీస్ రద్దవడంతో, ఐపీఎల్ 2025 తర్వాత రోహిత్ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే, ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందే భారత్-ఎ (India-A) తరఫున రోహిత్ ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భారత్-ఎ మరియు ఆస్ట్రేలియా-ఎ జట్ల మధ్య కాన్పూర్‌లో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, మరియు అక్టోబర్ 5న జరగనున్నాయి. ఈ అనధికారిక వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ ఆడనున్నాడని రెవ్‌స్పోర్ట్జ్ నివేదిక వెల్లడించింది. దీనిపై బీసీసీఐ(BCCI) నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19న జరిగే సిరీస్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రోహిత్ చివరిసారిగా మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తరఫున ఆడాడు. ఆ తర్వాత మరే మ్యాచ్‌లలోనూ కనిపించలేదు. ఈ అనూహ్య నిర్ణయం ద్వారా, రోహిత్ తన ఫిట్‌నెస్‌ను, ఫామ్‌ను తిరిగి పొందాలని భావిస్తున్నాడు. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ కొనసాగుతాడని అంచనాలున్నాయి, కాబట్టి అతను తన ఆటతీరును నిలబెట్టుకోవడం ఎంతో కీలకం.