విద్యుత్ (Electricity) స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుల్ వైర్ల (Cable Wires) సమస్యపై భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైర్లను తొలగించాలని కేబుల్ ఆపరేటర్లకు ఏడాదిగా నోటీసులు ఇస్తున్నా వారు స్పందించకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ వైర్ల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని, ఇది క్షమించరాని నేరమని పేర్కొన్నారు. ఇకపై ఎటువంటి జాప్యం లేకుండా, బలవంతంగానైనా సరే ఈ వైర్లను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అక్రమ కనెక్షన్లపై కఠిన చర్యలు
అనుమతులు లేకుండా విద్యుత్ కనెక్షన్లు తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. కొత్త కనెక్షన్లు తీసుకునేవారు తప్పనిసరిగా విద్యుత్ శాఖ సిబ్బంది సహాయం తీసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తుల ద్వారా కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం ప్రాణాలకు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
హైదరాబాద్‌లో అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్‌కో సీఎండీ హరీశ్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.