కన్నడ స్టార్ (Kannada Star) రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న *‘కాంతార చాప్టర్ 1’* (Kantara Chapter 1)పై అంచనాలు భారీగా ఉన్నాయి. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కోసం మేకర్స్ వరుసగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.
ఇక తాజాగా మరో కీలక పాత్రను పరిచయం చేశారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah) ఈ సినిమాలో ‘కులశేఖర’ (Kulasekhara) అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుల్షన్ గెటప్, ఇంటెన్స్ లుక్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. దీంతో సినిమా కోసం ఎదురుచూస్తున్న వారి ఉత్సుకత మరింత పెరిగింది.








