పాన్ ఇండియా (Pan India) స్టార్(Star) ప్రభాస్ రికార్డులకు మరోసారి సిద్ధమవుతున్నాడు. భారతీయ సినిమా గతిని మార్చిన ‘బాహుబలి'(Baahubali)విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ అక్టోబర్ 31న సినిమాను తిరిగి విడుదల చేయనున్నారు. అయితే, ఈసారి మరింత ప్రత్యేకంగా రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ రీ-రిలీజ్‌కు భారీ ప్రచారం కల్పించేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ప్రమోషన్లలో ప్రభాస్, రానా
ఈ చిత్ర ప్రచారం కోసం ప్రభాస్(Prabhas) మరియు రానా(Rana) కలిసి ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారని తెలుస్తోంది. దీన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు.
అక్టోబర్‌లో నాజర్, రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా వంటి ప్రధాన తారాగణం వరుస ఈవెంట్లలో పాల్గొంటారు.
ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ఒకే వేదికపైకి వచ్చి ‘రీయూనియన్’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం చేయబోతున్నారని సమాచారం.
ఈ రీ-రిలీజ్‌లో కొన్ని డిలీటెడ్ సన్నివేశాలను కూడా చేర్చినట్లు ప్రచారం జరుగుతోంది.
‘బాహుబలి’కి ఇప్పటికే భారీ ఫాలోయింగ్ ఉంది. రెండు భాగాలను కలిపి ఒకేసారి చూడాలనే ఆసక్తితో అభిమానులు ఉన్నారు. ప్రభాస్ సినిమా వచ్చి ఏడాది కావడంతో అభిమానులు ఈ రీ-రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ ప్రచారం మరియు అభిమానుల అంచనాల నేపథ్యంలో, ‘బాహుబలి’ రీ-రిలీజ్ కూడా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.








