War -2 : లోకేష్ వర్సెస్ జూ.ఎన్టీఆర్

War -2 : లోకేష్ వర్సెస్ జూ.ఎన్టీఆర్

నారా లోకేష్ (Nara Lokesh) రాజకీయ జీవితం మొత్తం ఒక అభద్రతాభావం చుట్టూ తిరుగుతోందని తాజా పరిణామాలు మళ్లీ నిరూపిస్తున్నాయి. అధికారంలోకొచ్చిన ఈ 15 నెల‌ల కాలంలో రాష్ట్రాన్ని, రాజ‌కీయంగా పార్టీ భ్ర‌ష్టుప‌ట్టించాడ‌ని టీడీపీ(TDP)లోనే అంత‌ర్మ‌థ‌నం మొద‌లైన నేప‌థ్యంలో తాజాగా జూ.ఎన్టీఆర్‌(Jr.NTR)ను ల‌క్ష్యంగా చేసుకొని త‌న అనుచ‌ర ఎమ్మెల్యే(MLA)తో బూతులు తిట్టించ‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. అంత‌ర్గ‌త, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై రెడ్‌బుక్(Redbook) పాశం వ‌దిలి పైశాచిక ఆనందం పొందుతున్నాడ‌నే ఆరోప‌ణ‌లు సొంత పార్టీ నుంచే వెల్లువెత్తుతున్నాయి. ఈ కోవ‌లోనిదే జూ.ఎన్టీఆర్‌పై వ్య‌క్తిగ‌త దాడి అంటున్నారు సినీ, రాజ‌కీయ విశ్లేష‌కులు.

రాజ‌కీయాల‌కు జూ.ఎన్టీఆర్ దూరంగా ఉన్నా తనకంటే మెరుగైన ప్రజాదరణ, అభిమాన బలం జూనియర్‌కు ఉందనే భయం లోకేష్‌ని రోజూ వెంటాడుతోంది. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల విశ్వాసం పొందలేకపోయిన లోకేష్, తన వారసత్వంపై నీలినీడ‌లు క‌మ్ముకుంటాయ‌నే బెరుకుతో జూనియర్ ఎన్టీఆర్‌పై అంతర్గత కుట్రలు పన్నుతున్నాడనేందుకు తాజా సంఘ‌ట‌న‌లే నిద‌ర్శ‌నం అంటున్నారు.

అనుచ‌రుడితో అతిదారుణంగా..
ఇటీవ‌ల జూనియర్ ఎన్టీఆర్ వ్య‌క్తిత్వాన్ని, అత‌ని త‌ల్లి వ్య‌క్తిత్వాన్ని దెబ్బ‌తీసేలా ప‌చ్చిబూతులు మాట్లాడిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెనుక లోకేష్ ప్రోత్సాహం ఉందనే వార్తలు బయటకొస్తున్నాయి. అనంత‌పురంలో టీడీపీ సీనియర్ నేత ప్ర‌భాక‌ర్ చౌద‌రిని కాద‌ని, దగ్గుపాటి ప్రసాద్‌ను ముందుకు తెచ్చి టికెట్ ఇప్పించిన‌ లోకేష్, తన అనుచరుడని ప్ర‌సాద్‌పై ముద్ర‌వేశారు. లోకేష్ అండ‌తో గ‌త 15 నెల‌లుగా ఇష్టారీతిగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని ప్ర‌సాద్‌పై ఆరోప‌ణ‌లున్నాయి. చిన‌బాబు స‌పోర్టు చూసుకొని పెట్రేగిపోతున్నాడ‌ని, పార్టీకి న‌ష్టం క‌లిగించే ప‌నులు చేస్తున్నాడ‌ని సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శిస్తున్నారు. లోకేష్‌కు అత్యంత స‌న్నిహిత అనుచ‌రుడిగా ఉన్న ఇదే ఎమ్మెల్యేను వాడుకొని జూనియర్ ఎన్టీఆర్‌ను, అత‌ని త‌ల్లిని బూతులు తిట్టించాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశాల్లోనూ జూ.ఎన్టీఆర్‌పై లోకేష్ అక్క‌సు వెళ్ల‌గ‌క్కేవార‌ని, చిన‌బాబు మ‌న‌సు ఎరిగే ద‌గ్గుపాటి ప్ర‌సాద్ నీచంగా మాట్లాడాడ‌ని అంటున్నారు.

జ‌న‌తా గ్యారేజీ టైమ్‌లోనూ.. విష‌ప్ర‌చారం
ఇదీ కొత్తేమీ కాదు అంటున్నారు జూ.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌. 2014 నుంచి 2019 మధ్య కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి చంద్రబాబు-లోకేష్ తీవ్రంగా ప్రయత్నించారు. అప్పట్లో జనతా గ్యారేజ్ సినిమా హవా నడుస్తున్నప్పుడు కూడా ఎన్టీఆర్‌కు పెరుగుతున్న పాపులారిటీని చూసి అసూయతో ఊగిపోయిన సంద‌ర్భాన్ని మ‌రోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఆ సినిమాపై త‌న వాళ్ల‌తో విషం చిమ్మించి ఎలాగైనా ఫ్లాప్ చేయాల‌ని ఎన్టీఆర్ కెరీర్‌ను తొక్కేయాల‌ని చూశారు. కానీ, దుష్ట‌ప‌న్నాగం ప‌న్నినా జ‌న‌తా గ్యారేజీ సూప‌ర్ హిట్ అయ్యిందని ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు.

2009 ఎన్నిక‌ల‌తోనే దూరం..
చంద్ర‌బాబు మ‌న‌స్త‌త్వాన్ని అతి ద‌గ్గ‌ర్నుంచి గ‌మ‌నించిన జూ.ఎన్టీఆర్‌ 2009 ఎన్నికల త‌రువాత నుంచి తెలుగుదేశం పార్టీకి దూర‌మ‌య్యారు. 2009 ఎన్నిక‌ల్లో నెగ్గ‌డానికి త‌న‌కు బ‌లం లేద‌ని గ్ర‌హించిన‌ చంద్ర‌బాబు ప్ర‌చారానికి జూ.ఎన్టీఆర్‌ను దించాడు. మామ‌య్య మాట‌లు విని జూనియ‌ర్ శ్రీ‌కాకుళం నుంచి మొద‌లుపెట్టి, కాలుకు బ‌ల‌పం క‌ట్టుకున్న‌ట్లుగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక ప్ర‌చారంలో తిరిగారు. ఖ‌మ్మం స‌మీపంలో జూ.ఎన్టీఆర్‌కు యాక్సిడెంట్ జ‌ర‌గ్గానే దాన్ని అడ్డం పెట్టుకొని ప‌క్క‌న‌పెట్టేశారు. దీంతో త‌నకూ త‌న‌ తండ్రికి జ‌రిగిన అవ‌మాన‌మే జ‌రిగింద‌ని గ్ర‌హించి అప్ప‌టి నుంచి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ సినిమాలపై శ్ర‌ద్ధ‌పెట్టి, అంచెలంచెలుగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. జూ.ఎన్టీఆర్ రాజ‌కీయాల‌కు చాలా దూరంగా ఉంటూ తన సినిమాలు తాను చేసుకుంటున్నా కూడా లోకేష్‌కు జూ.ఎన్టీఆర్ బెదురు, బెడ‌ద వీడ‌లేద‌నేందుకు తాజా సంఘ‌ట‌న‌లే నిద‌ర్శ‌నం.

హ‌రికృష్ణ‌ను గుర్తుచేస్తున్న అభిమానులు
జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణను సైతం గతంలో తెలుగుదేశం పార్టీ కోసం వాడుకుని తర్వాత కరివేపాకులా పక్కన పడేసి దారుణంగా అవమానించిన వైనాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ సమాచారాన్ని ప్రత్యర్థులకు చేరవేస్తున్నాడనే అభాండాలు వేసి దారుణంగా అవమానించారు. పార్టీలో క్రియాశీలకంగా ఎదుగుతాడన్న అక్కసుతో లేనిపోని నిందలు వేసి పార్టీ నుంచి దూరం చేశారని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అదే రీతిలో నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో ఎక్కడ లోకేష్ పోటీ అవుతాడేమోనన్న భయాందోళనతోనే క్యారెక్టర్ అసాసినేషన్ కు పాల్పడుతున్నారని అభిమానులు మండిపడుతున్నారు.

వార్‌-2 ఫంక్ష‌న్‌లో ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్‌..
సినిమా విడుద‌లకు ముందు హైద‌రాబాద్‌లో జ‌రిగిన వార్‌-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూ.ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. త‌న సినీ కెరీర్‌ను గుర్తుచేసుకుంటూ త‌న ఎదుగుద‌ల‌కు త‌న కుటుంబం కార‌ణ‌మ‌ని త‌ల్లిదండ్రులు, సోద‌రుల పేర్ల‌ను ప్ర‌స్తావించి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అదే విధంగా త‌న కేరీర్‌కు అడ్డుప‌డుతున్నవారికి పేర్లు ప్ర‌స్తావించ‌కుండా కౌంట‌ర్ ఇచ్చాడు తార‌క్‌. “నా తాత నందమూరి తారక రామారావు ఆశీస్సులు నామీద ఉన్నంత కాలం, నన్ను ఎవ్వరూ ఆపలేరు” అని వ్యాఖ్యానించారు

ట్విట్ట‌ర్ స్పేస్‌లో జూ.ఎన్టీఆర్, అత‌ని త‌ల్లిపై నీచంగా మాట్లాడిన వీడియోను బ‌య‌ట‌పెట్టిన జూనియ‌ర్ ఫ్యాన్స్‌

Join WhatsApp

Join Now

Leave a Comment