ఉపరాష్ట్రపతి (Vice President)ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న ఉద్దేశ్యంతో కమలనాథులు విపక్ష పార్టీలను సంప్రదించడం ప్రారంభించారు. ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థి పెట్టకుండా తమ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని బీజేపీ(BJP) ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఎన్డీయే(NDA) తన అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan) పేరును ప్రకటించింది.
ఈ క్రమంలో కేంద్ర రక్షణశాఖ (Union Defence Ministry) మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ప్రతిపక్ష నేతలకు ఫోన్ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడిన ఆయన, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Y.S.Jaganmohan Reddy)తోనూ ఫోన్(Phone)లో మాట్లాడారు. ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు(Unanimous Election) సహకరించాలని జగన్‌ను కోరారు.
ప్రస్తుతం రాజ్యసభ (Rajya Sabha)లో వైసీపీ(YSRCP)కి ఏడుగురు సభ్యులు ఉండగా, లోక్‌సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. ఈ బలం కారణంగానే బీజేపీ నేతలు వైసీపీ మద్దతు కోరుతున్నారు. వైసీపీ అధినేత జగన్ ఈ ప్రతిపాదనపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే గతంలోనూ పలు సందర్భాల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన జగన్, ఈసారి కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.