తెలంగాణ (Telangana) గవర్నర్ (Governor) కోటా (Quota) ఎమ్మెల్సీ ఎన్నిక (MLC Election)పై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెల్లడించింది. ఎమ్మెల్యే కోటా ద్వారా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఇద్దరి నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరామ్ (Kodandaram), అమీర్ అలీఖాన్ (Ameer Ali Khan)ల నియామకాలను (Appointments) రద్దు (Cancel) చేసింది. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో తాజా నామినేషన్లు తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.
గతంలో బీఆర్ఎస్(BRS) పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ తరఫున దాసోజ్ శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను అప్పుడు గవర్నర్గా ఉన్న తమిళిసై తిరస్కరించడంతో, ఇద్దరూ ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన కోదండరామ్, అమీర్ అలీఖాన్ల నియామకం చెల్లదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేస్తూ, ఆ వరకు కొత్త నామినేషన్లు తుది తీర్పుపై ఆధారపడి అమలులోకి వస్తాయని కోర్టు తెలిపింది.