దొంగ ఓటర్ల వివాదం.. పోస్ట్ డిలీజ్ చేసిన క‌లెక్ట‌ర్‌

దొంగ ఓటర్ల వివాదం.. పోస్ట్ డిలీజ్ చేసిన క‌లెక్ట‌ర్‌

Summarize with AI

పులివెందుల (Pulivendula)  జెడ్పీటీసీ (ZPTC) ఉప ఎన్నిక‌ (By Election)లో జరిగిన దొంగ ఓటింగ్ (Fake Voting) ఘటన మరోసారి రాజకీయ వేడి పుట్టించింది. నిన్న కలెక్టర్ (Collector) చెరుకూరి శ్రీధర్ (Cherukuri Sridhar) సమక్షంలో, జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం (Kondapuram) గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు పులివెందుల‌కు వ‌చ్చి దొంగ ఓట్లు వేశారు. అయితే ఈ విష‌యం క‌లెక్ట‌ర్ ట్వీట్ ద్వారా బ‌య‌ట‌ప‌డ‌డం సంచ‌ల‌నంగా మారింది.

పులివెందుల‌లో ఉప ఎన్నిక పోలింగ్ ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన క‌లెక్ట‌ర్‌.. ఓటింగ్ స‌ర‌ళిని గ‌మ‌నిస్తున్న ఫొటోలు తీయించి, త‌న వైఎస్సార్ క‌డ‌ప (YSR Kadapa) జిల్లా (District) అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేయించారు. అయితే ఇది గ‌మ‌నించిన ప‌లువురు వైసీపీ నేత‌లు క‌లెక్ట‌ర్ ఇనిస్పెక్ష‌న్ ఫొటోల్లో ఓట్లు వేస్తున్న‌వారు స్థానికులు కాద‌ని ప‌సిగ‌ట్టారు. ఆ ఫోటోలో ఉన్నవారు దొంగ ఓటర్లని బయటపడటంతో, ఆ పోస్టు పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది.

తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో, కలెక్టర్ ఒక్కసారిగా ఆ పోస్టు(Post)ను డిలీట్(Deleted) చేశారు. అయితే, అప్పటికే ఆ ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో, విచ్చలవిడిగా దొంగ ఓటింగ్ జరిగినట్టుకు ఇది సజీవ సాక్ష్యమని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై స్థానిక రాజకీయ వర్గాలు మరియు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment