పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ – ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్‌

పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ – ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్‌

జెడ్పీటీసీ (ZPTC) ఉప ఎన్నిక (By Election) సంద‌ర్భంగా ఉద‌యం వైసీపీ ఎంపీ (YSRCP MP) వైఎస్ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy)ని ముంద‌స్తు అరెస్టు (Arrest) చేశారు పులివెందుల (Pulivendula) పోలీసులు (Police). కాగా, ఉప ఎన్నిక‌ల పోలింగ్ (Polling) ముగిసిన అనంత‌రం పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌ను ఎంపీ అవినాష్ రెడ్డి వెళ్లారు. తనపై జారీ చేసిన ప్రివెంటివ్ అరెస్ట్ నోటీసులలో అంశాలు సరిగాలేవని ఆయన స్పష్టం చేశారు. చట్టంపై గౌరవంతో పిలుపునిచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చానని తెలిపారు. అయితే నోటీసుపై సంతకం చేయడాన్ని ఆయన నిరాకరించారు.

ఈ ఎన్నికలు పూర్తిగా అప్రజాస్వామికంగా (Undemocratically) జరిగాయని ఎంపీ అవినాష్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రశాంతంగా ఉండాల్సిన పోలింగ్ కేంద్రాల్లో టిడిపీ(TDP) నేతలు, కార్యకర్తలు దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు. ఎస్పీ(SP), డీఐజీలు (DIGs)  కూడా టీడీపీ తరఫున పని చేశారని, సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేస్తే నిజం బయటపడుతుందని సవాల్ విసిరారు. కేవలం రెండు నిమిషాల వీడియోలోనే జమ్మలమడుగు, కమలాపురం టిడిపీ నేతలను గుర్తించామన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment