పులివెందుల (Pulivendula) జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల (Elections) సందర్భంగా డీఎస్పీ (DSP) మురళీనాయక్ (Murali Nayak) వీరంగం సృష్టించారు. తమను ఓట్లు (Votes) వేయనివ్వడం లేదని, రిగ్గింగ్ (Rigging)ను అడ్డుకోవాలని కోరుతూ ఓటర్లు పోలీసులకు విజ్ఞప్తి చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న డీఎస్పీ మురళీనాయక్ ఓటర్లు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తీవ్రంగా మండిపడ్డారు.
“కాల్చిపడేస్తా నా కొడకా.. ఏమనుకుంటున్నావ్. ఇది యూనిఫామ్” అంటూ వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాల్చిపారేస్తా నా కొడకా.. యూనిఫామ్ ఇక్కడ
— Telugu Feed (@Telugufeedsite) August 12, 2025
పులివెందుల @YSRCParty కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలపై డీఎస్పీ సంచలన వ్యాఖ్య https://t.co/ldOvAD6OOE pic.twitter.com/alJEuHrUzX