ఇంగ్లండ్ (England)తో లార్డ్స్ (Lords) వేదికగా జరిగిన మూడో టెస్టు (Third Test) మ్యాచ్‌లో టీమిండియా (Team India) కెప్టెన్ (Captain) శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ధరించిన 77 నంబర్ జెర్సీ రికార్డు ధరకు అమ్ముడైంది. ఈ మ్యాచ్ తర్వాత గిల్ తన జెర్సీని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ (Andrew Strauss) ఫౌండేషన్ (Foundation) అయిన ‘రూత్ ఛారిటీ’ (Ruth Charity)కి విరాళంగా ఇచ్చారు. తాజాగా బడ్స్ వేలంలో ఈ జెర్సీ 4,600 పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.5.41 లక్షలు) పలికింది.
ఈ వేలంలో లభించిన వస్తువులన్నింటిలోకీ గిల్ జెర్సీకే అత్యధిక మొత్తం లభించడం విశేషం. ఈ వేలంలో ఇరు జట్ల ఆటగాళ్లు సంతకం చేసిన జెర్సీలు, క్యాప్‌లు కూడా ఉన్నాయి.
భారీ ధరకు అమ్ముడైన ఇతర జెర్సీలు
రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ నిధుల సేకరణ కోసం నిర్వహించిన ఈ వేలంలో ఇతర భారత ఆటగాళ్ల జెర్సీలకు కూడా మంచి ధర లభించింది.
జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా జెర్సీలు ఒక్కొక్కటి రూ.4.43 లక్షలు పలికాయి.
కేఎల్ రాహుల్ జెర్సీకి రూ.4.71 లక్షలు వచ్చాయి.
ఇంగ్లాండ్ ఆటగాడు కేఎల్ రూట్ జెర్సీ రూ.4.47 లక్షలకు అమ్ముడుపోయింది.
ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఐదు మ్యాచ్‌లలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకున్నారు. కెప్టెన్‌గా కూడా తన తొలి సిరీస్‌లోనే అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే గిల్ జెర్సీకి ఇంత భారీ ధర లభించిందని భావిస్తున్నారు.
రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ గురించి..
ఈ ఫౌండేషన్‌ను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్, తన భార్య రూత్ స్ట్రాస్ జ్ఞాపకార్థం స్థాపించారు. ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశ్యం పొగాకు వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, క్యాన్సర్ బాధితుల్లో అవగాహన పెంచడం, క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి కుటుంబాలకు మానసిక మద్దతు ఇవ్వడం. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో రూత్ స్ట్రాస్ మరణించడంతో ఆమె జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.