డ్రైవ‌ర్ హ‌త్య‌కేసులో వినుత కోటకు బెయిల్

డ్రైవ‌ర్ హ‌త్య‌కేసులో వినుత కోటకు బెయిల్

శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్చార్జ్ వినుత కోటకు డ్రైవర్ రాయుడు హత్య కేసులో మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు రెండు రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో A3గా ఉన్న వినుత కోట, ఆమె భర్త చంద్రబాబుతో పాటు మరో ముగ్గురు జులై 12న చెన్నై పోలీసులచే అరెస్టయ్యారు. రాయుడును గోడౌన్‌లో చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి, మృతదేహాన్ని చెన్నైలోని కూవం నదిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో వినుత దంప‌తుల‌తో పాటు మ‌రో ఇద్ద‌రిని అరెస్టు చేసి జూలుకు పంపించారు.

కాగా, ఈ కేసులో వినుత కోట‌కు కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది.. కోర్టు ఆదేశాల మేరకు, వినుత ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు చెన్నైలోని C3 సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలని నిబంధన విధించింది. నిన్న, ఈ రోజు ఉదయం ఆమె ఈ నిబంధనను పాటిస్తూ స్టేషన్‌లో సంతకం చేసినట్లు సమాచారం.

ఈ హత్య కేసు రాజకీయ రీత్యా సంచలనం రేపింది, శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై వినుత ఆరోపణలు చేయడంతో వివాదం మరింత తీవ్రమైంది. రాయుడు తమ వ్యక్తిగత, రాజకీయ సమాచారాన్ని ప్రత్యర్థులకు అందించినట్లు అనుమానంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే వినుత దంపతులు ఈ ఆరోపణలను ఖండిస్తూ, బొజ్జల సుధీర్ రెడ్డి ఈ హత్య వెనుక ఉన్నారని వాదించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment