సెట్‌లో సల్మాన్ సరదా.. కానీ నటి కన్నీళ్లు! ఇందిరా కృష్ణన్ అనుభవం వైరల్

సెట్‌లో సల్మాన్ సరదా.. కానీ నటి కన్నీళ్లు! ఇందిరా కృష్ణన్ అనుభవం వైరల్

బాలీవుడ్ స్టార్ (Bollywood Star) సల్మాన్ ఖాన్ (Salman Khan) సెట్స్‌ (Sets)లో సీరియస్‌కి కూడా కామెడీ టచ్‌ ఇస్తుంటారు. తాను ఉన్న చోట నవ్వులు వినిపించకపోతే ఊరుకోడు. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన సరదాలు సహ నటుల్ని గట్టిగానే ఉలికిపాటుకు గురిచేస్తాయి. అలాంటి సంఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం ‘రామాయణ్’ (Ramayan) సినిమాలో నటిస్తున్న నటి ఇందిరా కృష్ణన్ (Indira Krishnan), 2003లో సల్మాన్‌తో కలిసి చేసిన సినిమా ‘తేరే నామ్’ (Tere Naam) షూటింగ్‌లో జరిగిన ఓ మజిలీని గుర్తు చేసుకుంటూ ఆసక్తికరంగా వివరించారు.

“నువ్వు నన్ను కొడితే… చూసుకో!” – సల్మాన్ స్టైల్లో బెదిరింపు!
ఒక సన్నివేశంలో ఇందిరా, సల్మాన్ ఖాన్‌కి నిజంగానే ఒక చెంపదెబ్బ తగిలించాల్సి వచ్చిందట. షూటింగ్‌కు ముందు సల్మాన్ తనదైన యాసలో —
“నువ్వు నన్ను కొడితే ఏదైనా జరగొచ్చు.. జాగ్రత్త!” అని ముందుగానే ‘హెచ్చరించాడు’.

దీంతో ఇందిరా చిన్నగా టెన్షన్‌కి గురైందట. అంతటితో ఆగలేదు… సల్మాన్ తన బాడీగార్డ్‌ను కూడా ఈ డ్రామాలో భాగం చేశాడు. షూట్ అయిపోగానే, “మీడియా వచ్చేసింది మేడం.. మీరు భాయ్‌ను కొట్టారు కాబట్టి ఇది పెద్ద వార్త అవుతుంది. మీరు త్వరగా వెళ్లిపోండి” అంటూ బాడీగార్డ్ చెప్పడం మొదలుపెట్టాడు.

మీడియా గుంపు చూస్తేనే ఊపిరి ఆగిపోతుందా?
ఆ సమయంలో నిజంగానే మీడియా కూడా సెట్లోకి రావడం వల్ల, ఇందిరా కృష్ణన్ భయంతో కన్నీళ్లు పెట్టుకుందట. దాదాపు గంటసేపు ఈ డ్రామా కొనసాగించాక, చివరకు సల్మాన్ వచ్చి —
“ఇది కేవలం సరదా ఆట మాత్రమే.. సీరియస్ కావద్దు” అని చెబుతాడట.

Join WhatsApp

Join Now

Leave a Comment