ఎన్నికల్లో చీటింగ్‌పై ప‌క్కా ఆధారాలు.. రాహుల్ సంచలన వ్యాఖ్య‌లు

ఎన్నికల్లో చీటింగ్‌పై ప‌క్కా ఆధారాలు.. రాహుల్ సంచలన వ్యాఖ్య‌లు

ఢిల్లీ నగరంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన న్యాయ సదస్సులో, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారీగా చీటింగ్ జరిగిందని ఆరోపిస్తూ, తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. “చిన్న చిన్న తప్పులేమీ కాదు… ఆరు నెలలుగా మా బృందం ఎన్నికల ప్రక్రియను స్టడీ చేసింది. ఒక్క నియోజకవర్గంలోనే 6.5 లక్షల ఓటర్లలో 1.5 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారు. ఇది ఓ సాధారణ పొరపాటుగా తీసుకోలేం,” అని రాహుల్ స్పష్టం చేశారు. “ఎన్నికలు న్యాయంగా జరిగి ఉంటే, బీజేపీ గెలిచిన సీట్ల కంటే 15–20 సీట్లు తక్కువ వచ్చి ఉండేవి. అప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అయిఉండేవారు కాదు,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు
భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థగా వ్యవహరించాల్సి ఉన్నా, ప్రస్తుత పరిస్థితేంటో అందరికీ స్పష్టమవుతోంది అని రాహుల్ అన్నారు. 2014 నుంచే ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు మొదలయ్యాయని వివరించారు. “రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లో మాకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి…మేం ఆశ్చర్యపోయాం. ఈసీని అడిగితే – మీ ఆధారాలు ఏంటి? అని ఎదురుప్రశ్నించారని అని రాహుల్ గాంధీ ఆరోపించారు. “మహారాష్ట్రలో లోక్‌సభలో ఎక్కువ సీట్లు గెలిచాం, కానీ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. మద్యలో ఓ కోటి ఓట్లు అదనంగా వచ్చి చేరాయి. బీజేపీకి అనుకూలంగా ఉన్న వారిని ఓటర్లుగా చేర్చినట్లు ఆరోపించారు.

ఓటర్ల జాబితా పై అసంతృప్తి
ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను ఎన్నిసార్లు లేఖల ద్వారా తెలియజేసినా ఎటువంటి స్పందన లేదని రాహుల్ గాంధీ తెలిపారు. “వాటిని స్కాన్ చేయకుండానే, స్కాన్ ప్రూఫ్‌గా చూపుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం?” అని నిలదీశారు. రాజ్యాంగ బద్ధ పాలన కోసం తాము న్యాయపరంగా పోరాడతామని, దేశంలోని న్యాయవాదులు కూడా ఈ ఉద్యమంలో భాగం కావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. “ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన యుద్ధం” అని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment