బాల‌కృష్ణ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్‌

బాల‌కృష్ణ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్‌

కేంద్ర ప్రభుత్వం (Central Government) తాజాగా ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో (National Film Awards) ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష గౌరవం దక్కింది. ప్రముఖ హీరో బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) ఉత్తమ తెలుగు చిత్రంగా  (Best Telugu Film) ఎంపికైంది. అలాగే ‘హనుమాన్’ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో పురస్కారం పొందగా, ‘బలగం’ చిత్రంలోని పాట ఉత్తమ గీతంగా గుర్తింపు పొందింది. ‘బేబీ’ చిత్రానికి రచయిత సాయి రాజేష్‌ ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్ అవార్డును పొందారు. దర్శకుడు సుకుమార్ కుమార్తె శుకృతి వేణి ఉత్తమ బాల నటిగా ఎంపికవడం మరొక విశేషం.

ప్రతి ఏడాది లాగే, ఈసారి కూడా డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (DFF) ఆధ్వర్యంలో ఈ అవార్డులు నిర్వహించబడ్డాయి. 1954లో ప్రారంభమైన జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతీయ సినిమాల్లోని వైవిధ్యం, సాంస్కృతికత, సృజనాత్మకతకు గుర్తింపుగా నిలుస్తుంటాయి. 2023లో విడుదలైన చిత్రాలను పరిగణనలోకి తీసుకుని 22 భాషలలోని 115 చిత్రాలను జ్యూరీ సభ్యులు పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు.

ఇతర విభాగాల్లో విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

ఉత్తమ చిత్రం: ది ఫస్ట్ ఫిలిం

ఉత్తమ దర్శకత్వం: పీయూష్ ఠాకూర్ – ది ఫస్ట్ ఫిలిం

ఉత్తమ నాన్ ఫిక్షన్ ఫిల్మ్: ది సైలెంట్ ఎపిడెమిక్

ఉత్తమ షార్ట్ ఫిల్మ్: గిధ్ ది స్కావెంజర్ (హిందీ)

ఉత్తమ స్క్రిప్ట్: సన్ ఫ్లవర్స్ (కన్నడ)

ఉత్తమ ఫోటోగ్రఫీ: లిటిల్ వింగ్

ఉత్తమ మ్యూజిక్ డైరెక్షన్: ది ఫస్ట్ ఫిలిం – ప్రాణి దేశాయి

ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్: ఉప్పల్ దత్త

భాషల వారీగా ఉత్తమ చిత్రాలు:

తమిళం: పార్కింగ్

పంజాబీ: గొడ్డే గొడ్డే చా

ఒడియా: పుష్కర్

మలయాళం: ఉల్లజుకు

కన్నడ: కాండీలు

హిందీ: కథాల్

గుజరాతీ: వాష్

బెంగాలీ: డీప్ ఫ్రిడ్జ్

ఒడియా (నాన్ ఫిక్షన్): సీ అండ్ సెవెన్ విలేజస్

Join WhatsApp

Join Now

Leave a Comment