ఏపీలో దారుణం.. బాలిక‌ను గ‌ర్భ‌వ‌తిని చేసిన ప్రిన్సిపల్

ఏపీలో దారుణం.. బాలిక‌ను గ‌ర్భ‌వ‌తిని చేసిన ప్రిన్సిపల్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ (Dr.B. R. Ambedkar) కోనసీమ జిల్లా (Konaseema District) రాయవరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో (Private School) పాఠశాల ప్రిన్సిపల్ (Principal) కీచ‌క‌ప‌ర్వం బ‌య‌ట‌ప‌డింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రిన్సిప‌ల్ బాలిక‌పై అత్యాచారానికి ఒడిగట్టిన దుర్మార్గ‌పు ఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

వివ‌రాల్లోకి వెళితే.. రాయవరం మండలం మాచవరం (Machavaram)లో ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదోత‌ర‌గ‌తి విద్యార్థినిపై ప్రిన్సిప‌ల్ జ‌య‌రాజు (Jayaraju) అత్యాచారానికి (Sexual Assault) పాల్ప‌డ్డాడు. నాలుగు నెలల క్రితం బాలిక‌పై జ‌యరాజు లైంగిక దాడి చేశాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. దీంతో ఆ బాలిక భయంతో ఎవరితోనూ మాట్లాడ‌డం లేదు. అదే అవకాశంగా భావించిన ప్రిన్సిపల్, ఆమెను అనేకసార్లు లైంగిక దాడికి గురి చేశాడు.

కాలక్రమేణా బాలికకు పిరియడ్స్ రాకపోవడంతో తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసి వైద్య పరీక్షలు చేయించగా ఆమె గర్భవతిగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ భయంకర నిజం బయటపడిన తర్వాత వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికకు న్యాయం జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘ‌ట‌న‌ రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment