ఈనెల 31న వైసీపీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y. S.Jaganmohan Reddy) నెల్లూరు (Nellore)లో పర్యటించనున్నారు. వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యి నెల్లూరు జైల్‌లో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhan Reddy)ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. కాగా, వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై అధికారులు విధిస్తున్న ఆంక్షల (Restrictions) పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజల్లో పెరిగిపోతున్న ఆదరణను అడ్డుకునేందుకు అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పరోక్షంగా అధికార వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
జూలై 27న జగన్ పర్యటనకు సంబంధించి మొదట్లో అధికారులు కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు, హెలిప్యాడ్ (Helipad) వద్దకు కానీ, సెంట్రల్ జైలుకు కానీ కేవలం 10 మందికే అనుమతి (Permission) ఇస్తామన్నారు. నెల్లూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy) ఇంటి వద్దకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్న సమయంలోనూ అక్కడ ఎవరూ ఉండరాదని పోలీసులు నోటీసుల్లోపేర్కొన్నారు.
ఈ అనుమతుల నోటీసును స్వీకరించేందుకు ఎమ్మెల్సీ, నెల్లూరు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి (Parvathaneni Chandrashekar Reddy) నిరాకరించారు. అధికారుల వైఖరిని వ్యతిరేకిస్తూ ఆయన స్పందించారు. అనంతరం అధికార యంత్రాంగం మరొకసారి నోటీసులు జారీ చేసి, కొన్ని మార్పులు చేసింది. తాజాగా విడుదలైన రెండో నోటీసులో, జగన్ పర్యటనలో మూడు వాహనాల బదులు 15 వాహనాలకు అనుమతినిచ్చారు. కానీ, హెలిప్యాడ్ మరియు జైలు వద్దకు మాత్రం మళ్లీ కేవలం 10 మందికే అనుమతిస్తామని స్పష్టం చేశారు. నల్లపరెడ్డి ఇంటి వద్దకు మాత్రం ఎవరూ రావొద్దని ఆదేశాలిచ్చారు.
టీడీపీ కుట్ర రాజకీయమంటూ వైసీపీ విమర్శ
ఈ పరిణామాలపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. నెల్లూరులో జగన్ పర్యటనకు అనుమతిచ్చినా, అడుగడుగునా ఆంక్షలు పెడుతున్న అధికారుల తీరు చూస్తుంటే, వీరి వెనక టీడీపీ కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ జగన్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారు. అందుకే అధికార యంత్రాంగాన్ని వాడుకుని పర్యటనపై కఠిన ఆంక్షలు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య పరంగా దారుణమైన చర్య” అని ఆరోపిస్తున్నారు.