సిట్‌ అధికారులే ఈ లీకులకు కారణం.. కోర్టులో రిటైర్డ్ ఐఏఎస్

సిట్‌ అధికారులే ఈ లీకులకు కారణం.. కోర్టులో రిటైర్డ్ ఐఏఎస్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని రూ.3,200 కోట్ల మద్యం కేసు (Liquor Case)లో అరెస్టైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. ధనుంజయరెడ్డి (K. Dhanunjaya Reddy), విజయవాడ (Vijayawada)లోని యాంటీ-కరప్షన్ బ్యూరో (ఏసీబీ) కోర్టు (ACB Court) ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయరెడ్డి, ఈ కేసు పూర్తిగా కట్టుకథ అని, తనపై వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్‌ఐటీ) అధికారులే (SIT Officials ) మీడియా (Media)కు లీకులు (Leaks) ఇచ్చి, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోర్టు ఎదుట వాపోయారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఏసీబీ కోర్టులో ధనుంజయరెడ్డి మాట్లాడుతూ, “మేము ఒక ఎకరం విస్తీర్ణం ఉన్న జైల్లో ఉన్నాం. జైలు పక్కన భవనం నుంచి మమ్మల్ని ఫొటోలు తీస్తున్నారు. ఎవరు తీస్తున్నారని అడిగితే, పై నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనశైలిని విలాసవంతమైనదిగా చిత్రీకరిస్తూ కొన్ని పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, తాను కేవలం ఒక శాంత్రో కారు మాత్రమే కొనుగోలు చేశానని, తన భార్య ఉపయోగించే మరో కారును విలాసవంతమైనదిగా చెప్పడం అసత్యమని వాదించారు. “మాజీ సీఎస్, మాజీ ఫారెస్ట్ కన్జర్వేటర్‌ను నా బినామీలుగా చిత్రీకరిస్తున్నారు. గత 20 రోజులుగా పత్రికల్లో వచ్చిన కథనాలు చూస్తే ఛార్జ్‌షీట్ చదవాల్సిన అవసరం లేదు. ఛార్జ్‌షీట్‌లోని ప్రతి పేరా మీడియాకు లీక్ అయింది. ఇది కచ్చితంగా కట్టుకథ కేసు” అని ఆయన ఆరోపించారు.

ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమని, సిట్‌ అధికారులు తమను టార్గెట్ చేస్తారని తెలిసినా, న్యాయస్థానంలో సత్యం చెప్పడం తన కర్తవ్యమని పేర్కొన్నారు. “మీడియా కథనాల వల్ల మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి వ్యక్తిత్వ హననం సరికాదు. సిట్‌ అధికారులే ఈ లీకులకు కారణం” అని ఆయన కోర్టు ఎదుట వాపోయారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment