ఏపీకి బిగ్ రిలీఫ్‌.. 24 గంట‌ల్లో భారీ వర్ష సూచన

ఏపీకి బిగ్ రిలీఫ్‌.. 24 గంట‌ల్లో భారీ వర్ష సూచన

వ‌ర్షాకాలంలోనూ వేస‌వికాలం అవ‌స్థ‌లు ప‌డుతున్న‌ ఏపీ (Andhra Pradesh) ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ (Weather Department) శుభ‌వార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని రాబోయే 24 గంటల్లో భారీ (Heavy) నుంచి అతి భారీ (Very Heavy) వర్షాలు (Rains) తాకనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రుతుపవన గాలులు (Monsoon Winds) కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇదే సమయంలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది.

ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత వర్షపాతం నమోదు కానుంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ మీదుగా 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కోస్తా మరియు రాయలసీమలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ప్రాంతాలవైపు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment