డబ్ల్యూసీఎల్ (WCL) (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్) 2025 జూలై 18న యునైటెడ్ కింగ్‌డమ్ (United Kingdom)లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. జూలై 20న భారత్ ఛాంపియన్స్ (India Champions), పాకిస్తాన్ ఛాంపియన్స్ (Pakistan Champions) మధ్య మ్యాచ్ బర్మింగ్‌హామ్ (Birmingham)లో రాత్రి 9 గంటలకు జరుగుతుంది. భారత జట్టు కెప్టెన్ (Captain)గా యువరాజ్ సింగ్ (Yuvraj Singh) వ్యవహరిస్తున్నారు.
ఈ టోర్నమెంట్‌లో సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు వంటి 17 మంది మాజీ క్రికెటర్లు భారత జట్టులో ఉన్నారు. 2024లో జరిగిన తొలి ఎడిషన్‌లో భారత్ చాంపియన్‌గా నిలిచింది.
డబ్ల్యూసీఎల్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. జూలై 18 నుంచి ఆగస్టు 2 వరకు నాలుగు వేదికలపై మొత్తం 15 లీగ్ మ్యాచ్‌లు, తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్ జరుగనున్నాయి. ఫైనల్ ఆగస్టు 2న బర్మింగ్‌హామ్‌లో రాత్రి 9 గంటలకు జరగనుంది.