వైసీపీ (YSRCP) ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja)పై నగరి టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) గాలి భాను ప్రకాష్ (Gali Bhanu Prakash) చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోజా “రూ.2 వేలకు ఏ పనైనా చేసేది, వ్యాంప్ క్యారెక్టర్ (Vamp Character)కు ఎక్కువ, హీరోయిన్ (Heroine)కు తక్కువ” అని గాలి భాను ప్రకాష్ ప్రెస్ ముందు, పబ్లిక్‌గా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని ఆగ్రహిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే మాటల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (Vemireddy Prashanthi Reddy) విషయంలో నానా హంగామా చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), లోకేష్(Lokesh), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లు ఇప్పుడేం సమాధానం చెబుతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఆర్కే రోజా, రాజకీయాల్లోకి రాకముందు టాలీవుడ్‌లో అగ్రనటిగా వెలుగొందారు. చిరంజీవి, బాలకృష్ణ, జగపతిబాబు వంటి ఇండస్ట్రీలోని సీనియర్ నటులతో కలిసి అనేక సినిమాల్లో నటించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినీ పరిశ్రమతో సంబంధాలు తుంచుకోలేదు. రాజకీయంగా ఎంత ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ.. సినిమా పరిశ్రమపై మమకారం చంపుకోలేదు. బుల్లితెర షోలలో జడ్జిగానూ పనిచేశారు.
అయితే, గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలు ఆమె సినీ నేపథ్యాన్ని, వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీశాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. “మహిళల గౌరవం గురించి ఉపన్యాసాలిచ్చే టీడీపీ నాయకులు, ప్రతిపక్ష మహిళా నాయకులపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలను సమర్థిస్తారా?” అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇండస్ట్రీ (Industry)పై అత్యంత ప్రేమ కనబరిచే రోజాకు జరిగిన అవమానంపై సినీ పరిశ్రమ స్పందిస్తుందా..? గాలి భానుప్రకాష్ వ్యాఖ్యలను ఖండించి, రోజా క్షమాపణ చెప్పాలని ధైర్యంగా ముందుకువచ్చి ఎవరైనా స్టేట్‌మెంట్ ఇవ్వగలరా..? కనీసం రోజాకు మద్దతుగా ట్వీట్ అయినా చేయగలరా..? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు నెటిజన్లు. అయితే కూటమి ప్రభుత్వంలో కీలక పొజిషన్‌లో ఉన్న వ్యక్తి సినిమా వాళ్లను కంట్రోల్ చేస్తున్నారని కూడా మాట్లాడుకోవడం గమనార్హం.
మాజీ మంత్రి రోజాపై @JaiTDP ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
— Telugu Feed (@Telugufeedsite) July 17, 2025
నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆర్కే రోజా ఫిర్యాదు#AndhraPradesh #Nagari #TDP #YSRCP pic.twitter.com/qDeyQMaFma








