కొత్త రేషన్ కార్డులు.. సీఎం రేవంత్ ట్వీట్ వైర‌ల్

కొత్త రేషన్ కార్డులు.. సీఎం రేవంత్ ట్వీట్ వైర‌ల్

కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) కోసం పేదవాడి పదేళ్ల ఎదురు చూపులు నేడు ఫలించబోతున్నాయి అని ముఖ్య‌మంత్రి (Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్ర‌క‌టించారు. రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్(Tweet) సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. పల్లెల్లో రేషన్ షాపులు సన్నబియ్యంతో సందడి సంతరించుకున్నాయని, పేదల ముంగిట మంచి రోజులు వచ్చాయని సీఎం తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.61 లక్షల కొత్త రేషన్ కార్డుల జారీతో 3.10 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ కార్యక్రమం తిరుమలగిరి (Tirumalagiri)లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది.

ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ద్వారా ఒక్కో కుటుంబానికి 6 కేజీల ఉచిత సన్నబియ్యం అందించనున్నారు. ఈ పథకం ద్వారా ఆహార భద్రతతో పాటు ఉచిత బియ్యం, ఆరోగ్య సంరక్షణ వంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుబాటులోకి రానున్నాయి. మొదటి విడతగా 3.54 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. ఇది దశాబ్ద కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు శుభవార్తగా నిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా “ఇది పేదల సంక్షేమం పట్ల మా వజ్ర సంకల్పానికి నిదర్శనం” అని పేర్కొన్నారు, ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి చేస్తున్న కృషిని హైలైట్ చేస్తుంది.

గతంలో రేషన్ కార్డులు లేకపోవడం వల్ల రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాలు అందని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఈ కొత్త పథకం ద్వారా ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో లక్ష మందితో జరిగిన బహిరంగ సభలో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment