అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది కూలీల మృతి

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది కూలీల మృతి

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం రెడ్డివారిపల్లి చెరువు కట్ట వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. మామిడి లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న 19 మంది కూలీలలో 9 మంది దుర్మరణం చెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ప్రమాదానికి గురైన లారీ రాజంపేట నుంచి రైల్వే కోడూరు మార్కెట్‌కు మామిడి లోడుతో వెళ్తోంది. లారీ రెడ్డివారిపల్లి చెరువు కట్ట వద్ద అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పుల్లంపేట పోలీసులు, స్థానికులు, రెడ్డిపల్లి గ్రామస్తులు సహాయక చర్యలు చేపట్టారు. లారీ కింద చిక్కుకున్న 10 మంది కూలీలను రక్షించి, వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన 9 మంది కూలీలు శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందినవారు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అన్నమయ్య జిల్లా అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాద కారణాలపై విచారణ జరుపుతున్నారు. రాష్ట్ర మంత్రి జనార్దన్ రెడ్డి ఈ ఘటనపై స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతులంతా కూలీలు కావడం బాధాకరమని, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. ప్రమాద కారణంగా స్థానిక రహదారిపై రాకపోకలు కొంతకాలం అంతరాయం కలిగాయి.

జ‌గ‌న్ సంతాపం..
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం, రెడ్డివారిపల్లె చెరువు వద్ద లారీ బోల్తాపడిన ఘటనలో కూలీలు మరణించిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో కూలీలు మరణించడం అత్యంత దురదృష్టకరమన్నారు. గాయపడ్డవారికి మంచి వైద్యం అందేలా చూడాలని, మృతుల కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment