కాకినాడ (Kakinada)లోని రంగరాయ మెడికల్ కాలేజీ (Rangaraya Medical College)కి అనుబంధంగా ఉన్న జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్ (GGH)లో 50 మంది పారామెడికల్ (Paramedical) విద్యార్థినులపై (Girl Students) లైంగిక వేధింపుల (Sexual Harassment) ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy), ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మి రాజు (Jimmy Raju), గోపాలకృష్ణ, ప్రసాద్‌లు విద్యార్థినుల శరీర భాగాల ఫోటోలను(Photos) రహస్యంగా తీసి, వాటిని అడ్డుపెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేసినట్లు విద్యార్థినులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ కోరిక తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించి, నెల రోజులుగా ఈ దాష్టీకాలు కొనసాగినట్లు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు అందడంతో నలుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు, కళ్యాణ్ చక్రవర్తి ఇంకా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నియోజకవర్గమైన (Constituency’s) పిఠాపురానికి (Pithapuram) సమీపంలో జరిగినప్పటికీ, ఆడవారిపై జరిగే అన్యాయాలను సహించనని, తక్షణం స్పందిస్తానని పదేపదే చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మౌనం వహించడం రాష్ట్రంలోని మహిళల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలోనూ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
వైసీపీ(YSRCP) మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి (Prasannakumar Reddy) టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA)పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వెంటనే ట్వీట్ చేసిన పవన్, ఏకంగా 50 మంది విద్యార్థినులపై జరుగుతున్న దారుణ ఘటనపై ఇప్పటివరకు స్పందించకపోవడం దుర్మార్గమని రాష్ట్ర ప్రజలు విమర్శిస్తున్నారు. నిందితుడు కళ్యాణ్ చక్రవర్తి జనసేన సానుభూతిపరుడని గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ, ఈ విషయంపై అధికారిక సమాచారం లేదు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నా.. పవన్ కళ్యాణ్ నోరు మెదకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు “మహిళల భద్రతపై గొప్పగా మాట్లాడే పవన్ కళ్యాణ్, తన నియోజకవర్గం సమీపంలో జరిగిన ఈ దారుణ ఘటనపై స్పందించకపోవడం ఆయనకు మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా మహిళలపై జరుగుతున్న ఘటనలపై పవన్ నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారని, టీడీపీ(TDP)కి సంబంధించిన విషయాల్లో మాత్రమే తక్షణం స్పందిస్తున్నారని స్థానిక మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.