తండ్రి చేతిలో మహిళా టెన్నిస్ ప్లేయర్ దారుణ హత్య…

తండ్రి చేతిలో మహిళా టెన్నిస్ ప్లేయర్ దారుణ హత్య…

హర్యానా (Haryana) రాష్ట్రం గురుగ్రామ్‌ (Gurugramలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ (International Tennis Player) రాధికా యాదవ్ (Radhika Yadav) (25) ను ఆమె కన్నతండ్రి (Father) దీపక్ యాదవ్ (Deepak Yadav) గన్‌(Gun)తో కాల్చి చంపాడు. ఈ ఘటన సెక్టార్ 57లోని వారి నివాసంలో జరిగింది.

ఐదు రౌండ్ల కాల్పులు జరపగా, మూడు బుల్లెట్లు తగిలి రాధిక తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలు రాధికా యాదవ్ అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్‌లో 113వ స్థానంలో కొనసాగుతోంది. ఈ దారుణానికి పాల్పడిన ఆమె తండ్రి దీపక్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సూటిపోటి మాటలే కారణమా?

“కూతురు సంపాదన మీద బతుకుతున్నావా? అది ఓ బతుకేనా?” వంటి సూటిపోటి మాటలే తండ్రిలోని రాక్షసత్వాన్ని నిద్రలేపాయని, చివరికి కూతురు ప్రాణాలు తీసేలా చేశాయని ఈ కేసు వివరాలు తెలియజేస్తున్నాయి. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

రాధికా యాదవ్ రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, కొద్దికాలం క్రితం జరిగిన టెన్నిస్ పోటీల్లో తీవ్ర గాయం కావడంతో ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కొంతకాలం టెన్నిస్‌కు దూరంగా ఉండటంతో ఆమె మానసికంగా కృంగిపోయింది. అయినప్పటికీ, తనలాగే టెన్నిస్‌లో రాణించాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు ఆమె ఒక టెన్నిస్ అకాడమీని ప్రారంభించింది. అనతికాలంలోనే తన కోచింగ్‌తో రాధికా యాదవ్ పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. తండ్రికి కూడా ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలిచింది.

అయితే, దీపక్ యాదవ్ కుటుంబానికి లభిస్తున్న పేరు, ప్రతిష్టలు నచ్చని కొందరు ఇరుగుపొరుగు వారు సూటిపోటి మాటలు అనడం ప్రారంభించారట. రాధిక టెన్నిస్ అకాడమీ ఆదాయంపై దీపక్ ఆధారపడి జీవిస్తున్నాడని ఎగతాళి చేసేవారట. ఈ అవమానమే అతడి కోపాన్ని పెంచింది. రాధిక తన టెన్నిస్ అకాడమీని మూసివేయాలని తండ్రి కోరాడు. కానీ ఆమె అందుకు నిరాకరించింది. తన కుమార్తె కెరీర్, సంపాదనపై సమాజం నుంచి వస్తున్న విమర్శల కారణంగానే కూతురి ప్రాణం తీసినట్లు తండ్రి దీపక్ పోలీసుల విచారణలో నేరం అంగీకరించాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment