తెలంగాణ‌పై మాధ‌వ్‌కు ఇంత క‌క్షా..? – కేటీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు

తెలంగాణ‌పై మాధ‌వ్‌కు ఇంత క‌క్షా..? - కేటీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు

ఏపీ (AP) బీజేపీ నూత‌న అధ్యక్షుడు (BJP New President) పీవీఎన్ మాధవ్ (PVN Madhav) చేసిన ప‌ని యావ‌త్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆగ్ర‌హం తెప్పించింది. మాధ‌వ్ తీరు తెలంగాణ ప్ర‌జ‌ల‌పై ఆయ‌న‌కు ఎంత ఆక్రోశం ఉందో బ‌య‌ట‌పెట్టింద‌ని మండిప‌డుతున్నారు ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు మాధ‌వ్ మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh)కు బహుకరించిన భారత చిత్రపటంలో తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది.

మాధ‌వ్ చేష్ట‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లోకేష్‌కు బ‌హుక‌రించిన భార‌త‌దేశ చిత్ర‌ప‌టంలో తెలంగాణ రాష్ట్రం లేకపోవడంపై కేటీఆర్‌(KTR) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తెలంగాణ ప్రజల అవమానంగా, రాష్ట్ర అస్తిత్వానికి భంగం కలిగించే చర్యగా అభివర్ణించిన కేటీఆర్, బీజేపీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi)కి సూటి ప్రశ్నలు సంధిస్తూ, తెలంగాణ (Telangana)ను భారత చిత్రపటం (India Map) నుంచి తొలగించడం (Removal) బీజేపీ అధికారిక విధానమా అని ప్రశ్నించారు.

కేటీఆర్ తన ఆగ్రహాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం దశాబ్దాల పాటు జరిగిన పోరాటాన్ని, తెలంగాణ ప్రజల త్యాగాలను బీజేపీ అవమానించిందని ఆరోపించారు. “భారత చిత్రపటంలో తెలంగాణను తొలగించడం రాజ్యాంగ విరుద్ధం. ఇది పొరపాటున జరిగినా, తెలంగాణ ప్రజలను అపహాస్యం చేసినందుకు బీజేపీ నాయకత్వం క్షమాపణ చెప్పాలి. ఒకవేళ ఇది ఉద్దేశపూర్వక చర్య అయితే, తెలంగాణ అస్తిత్వాన్ని, భౌగోళిక గుర్తింపును గుర్తించకపోవడం బీజేపీ అధికారిక విధానమా?” అని ప్రధాని మోడీని ప్రశ్నించారు. ఈ ఘటన తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను గాయపరిచిందని, బీజేపీ ఈ చర్యను సమర్థించుకోలేదని కేటీఆర్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment