అల్లూరి జిల్లాలో విషాదం.. అడ‌విలో ఇంటర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

అల్లూరి జిల్లాలో విషాదం.. అడ‌విలో ఇంటర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) జిల్లాలోని అట‌వీ ప్రాంతంలో ఇంట‌ర్ (Inter) విద్యార్థిని (Female Student) చెట్టుకు ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య (Suicide) చేసుకున్న సంఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టిస్తోంది. జిల్లాలోని చింతూరు మండలం గొందిగూడెం (Gondigudem) గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఇంటర్ సెకండియర్ విద్యార్థిని కూర జయ (Kura Jaya) (19) చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మారేడుమిల్లి (Maredumilli)లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న జయ, మంగళవారం ఉదయం “కాలేజీకి వెళ్తున్నా”ని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అయితే, సాయంత్రం 6 గంటల సమయంలో ఆమె మృతదేహం గొందిగూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే చింతూరు సబ్-ఇన్‌స్పెక్టర్ సాదిక్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జయ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రేమ వ్య‌వ‌హారం ఏమైనా కార‌ణ‌మా..? అని విచారిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టారు. జయ కుటుంబ సభ్యులు, స్నేహితులు, కళాశాల యాజమాన్యాన్ని విచారిస్తున్నారు. ఆమె ఫోన్ రికార్డులు, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గొందిగూడెం గ్రామవాసులు, జయ కుటుంబ సభ్యులు ఈ అకాల మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు. యువతలో మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలపై అవగాహన కల్పించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసేందుకు పోలీసులు తమ విచారణను ముమ్మరం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment