స‌చిన్ స్థానాన్ని గిల్ భ‌ర్తీ చేస్తాడు – ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌

ఇంగ్లాండ్ సిరీస్‌లో శుభ్‌మన్‌ గిల్ రాణింపు

ఇంగ్లాండ్‌ (England)లో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్‌ (Five Test Match)ల సిరీస్‌లో టీమ్‌ఇండియా (Team India) ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో గెలవగా, రెండో టెస్ట్‌లో భారత్ 336 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ టీమ్‌ఇండియా కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) రాణించాడు. ముఖ్యంగా రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులతో డ‌బుల్ సెంచ‌రీ బాదిన గిల్, రెండో ఇన్నింగ్స్‌లోనూ 161 పరుగులతో భారీ శతకం సాధించాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్‌పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మార్క్ బుచర్ (Mark Butcher) ప్రశంసల వర్షం కురిపించాడు.

కోహ్లీ, సచిన్ స్థానాన్ని భర్తీ చేశాడు: మార్క్ బుచర్
శుభ్‌మన్‌ గిల్ బ్యాటింగ్ ఆర్డర్‌లో విరాట్‌ కోహ్లీ, సచిన్‌ స్థానాన్ని విజయవంతంగా భర్తీ చేశాడని, నాలుగో స్థానంలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని బుచర్ కొనియాడాడు. “టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం సాదాసీదా విషయం కాదు. విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ గిల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ స్థానాన్ని చాలా తేలికగా భర్తీ చేశాడు. నాలుగో స్థానంలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మంచినీళ్ల ప్రాయంలా పరుగుల వరద పారిస్తున్నాడు. టెక్నికల్‌గా కూడా గిల్ బ్యాటింగ్ బాగుంది. ఈ సిరీస్‌లో చక్కగా రాణిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 600 వరకు పరుగులు రాబట్టాడు” అని బుచర్ విశ్లేషించాడు.

కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌పై బుచర్ వ్యాఖ్యలు
అలాగే, కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) గురించి కూడా మార్క్ బుచర్ మాట్లాడాడు. “టెస్ట్ క్రికెట్‌కు రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్ తర్వాత కేఎల్‌ రాహుల్, యశస్వి జైస్వాల్ జోడీ చక్కగా ఓపెనింగ్ చేస్తోంది. వీరిద్దరూ వేగంగా పరుగులు సాధిస్తున్నారు. షార్ట్ బాల్స్ విషయంలో మాత్రం జైస్వాల్ కాస్త ఇబ్బందిపడుతున్నాడు. అతడు ఆ ఒక్క లోపాన్ని సరిచేసుకుంటే సరిపోతుంది” అని మార్క్ బుచర్ సూచించాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment