రైతు సంక్షేమంపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

రైతు సంక్షేమంపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

తెలంగాణ (Telangana) రాజకీయాలు (Politics) సవాళ్లు, ప్రతిసవాళ్లతో మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరియు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మధ్య మాటల యుద్ధం ముదిరింది. రైతు సంక్షేమం (Farmer Welfare)పై బహిరంగ చర్చకు రావాలని రేవంత్ సవాల్ (Challenge) విసరగా, కేటీఆర్ దాన్ని స్వీకరించి, డేట్, టైమ్ కూడా ఖరారు చేసి ప్రతిసవాల్ విసిరారు.

కేటీఆర్ ఛాలెంజ్: 72 గంటల్లో ప్రిపేర్ అయి రండి!
శుక్రవారం కాంగ్రెస్ (Congress) నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేవలం 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని, రైతుల శ్రేయస్సు కోసం చేపట్టిన పనులపై బహిరంగ చర్చకు రావాలంటూ బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)లకు సవాల్ విసిరారు.

ఈ సవాల్‌పై స్పందించిన కేటీఆర్, రైతు రాజ్యంపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. “డేట్, టైమ్, ప్లేస్ మీరు చెప్తారా? మమ్మల్ని చెప్పమంటారా?” అంటూ ప్రశ్నించారు. “72 గంటలు టైం ఇస్తున్నామని.. ప్రిపేర్ అయి రావాలంటూ” సెటైర్లు వేశారు. అంతేకాకుండా, రేవంత్ రెడ్డి సవాల్‌ నుంచి పారిపోకుండా చర్చకు రావాలని కోరారు. “8వ తేదీన సోమాజిగూడ (Somajiguda) ప్రెస్‌క్లబ్‌ (Press Club)కు మేము వస్తాం. ఆ రోజు ఉదయం 11 గంటలకు మీరు రండి. ఒక్కరుగా వచ్చినా.. గుంపుగా వచ్చినా మేము రెడీ. పాలు ఏంటో, నీళ్లు ఏంటో తేలుద్దాం,” అంటూ కేటీఆర్ ప్రతిసవాల్ విసిరారు.

కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు
సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు కేసీఆర్(KCR) అవసరం లేదని, తాము చాలని కేటీఆర్ అన్నారు. నీళ్లు, నియామకాలు, నిధుల కోసం తాము పోరాడితే.. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు ఆయన సన్నిహితులకు పోతున్నాయని విమర్శించారు.

రైతు సంక్షేమానికి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, రైతు బంధు అనేది విప్లవాత్మక పథకం అని, ఆక్స్‌ఫర్డ్‌లో సైతం దానికి ప్రశంసలు వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయని అన్నారు. కానీ గత 18 నెలలుగా రాష్ట్రంలో “టైమ్ పాస్ పాలన” నడుస్తోందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే అందుబాటులో లేని ఎరువులు, విత్తనాలు, కాలిపోతున్న మోటర్లు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఉద్యోగాల భర్తీపై కేటీఆర్ సెటైర్లు:

ఏడాదిన్నరలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ కొట్టిపారేశారు. ఉద్యోగాల భర్తీపై రేవంత్ రెడ్డి మాట్లాడటం “మిలీనియం జోక్” అని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు.. అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేశామనడం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని, కాంగ్రెస్‌కు మరోసారి అధికారం రావడం కల అని ఎద్దేవా చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment