దాంతో పోల్చొద్దు”: కోర్టు తీర్పుపై షమీ భార్య హసీన్ జహాన్ అసంతృప్తి

దాంతో పోల్చొద్దు": కోర్టు తీర్పుపై షమీ భార్య హసీన్ జహాన్ అసంతృప్తి

షమీ భార్య హసీన్ జహాన్ ఏమన్నారంటే?
తమ విడాకుల కేసులో భాగంగా తన, కుమార్తె సంరక్షణ కోసం నెలకు రూ. 4 లక్షల భరణం చెల్లించాలని కోల్‌కతా హైకోర్టు (Kolkata High Court) భారత పేసర్ మహ్మద్ షమీ (Shami)ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో రూ. 1.5 లక్షలు హసీన్ జహాన్ (Hasin Jahan) కోసం, రూ. 2.5 లక్షలు కుమార్తె (Daughter) కోసం చెల్లించాలని కోర్టు పేర్కొంది.

ఈ తీర్పుపై షమీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే, హసీన్ జహాన్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తూ, దాదాపు ఏడేళ్లుగా తాను చేస్తున్న పోరాటానికి న్యాయం జరిగిందని అన్నారు. అయితే, షమీ స్థాయికి, ఆదాయానికి పోలిస్తే ఈ భరణం చాలా తక్కువని, తాము నెలకు రూ. 10 లక్షల వరకు కోరినట్లు ఆమె వెల్లడించారు.

“చాలా సుదీర్ఘంగా మేము చేసిన పోరాటానికి ఇప్పుడు విజయం దక్కింది. నా కుమార్తెకు మంచి విద్యను అందించగలను. ఆమె జీవితం సాఫీగా సాగేలా చూడగలను. అయితే, షమీ స్థాయి, అతని జీవన విధానం, సంపాదన చూస్తే ఈ భరణం చాలా తక్కువే. అందుకే దాన్ని అస్సలు పోల్చకూడదు. ఏడేళ్ల కిందటే మేము అతని నుంచి నెలకు రూ. 10 లక్షల వరకు ఇప్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాం. అప్పటినుంచి అతని ఆదాయం, ఖర్చులు కూడా పెరిగాయి. షమీ ఎలా తన జీవితాన్ని గడుపుతున్నారో, నేను, నా కుమార్తె కూడా అదే స్థాయిని కొనసాగించే హక్కు ఉంది” అని జహాన్ వ్యాఖ్యానించారు.

భరణం పెరిగే అవకాశం: హసీన్ జహాన్ లాయర్
హసీన్ జహాన్ తరపు న్యాయవాది ఇంతియాజ్ అహ్మద్ (Intiyaz Ahmed) మాట్లాడుతూ, “హసీన్ జహాన్, ఆమె కుమార్తెకు ఇది అద్భుతమైన క్షణం. 2018 నుంచి ఆమె చాలా ఇబ్బందులు పడింది. ఇప్పుడు కోర్టు తీసుకున్న నిర్ణయంతో న్యాయం జరిగింది. జహాన్ ఖర్చుల కోసం రూ. 1.5 లక్షలు, కుమార్తె కోసం రూ. 2.5 లక్షల చొప్పున నెలకు షమీ చెల్లించాలి. అలాగే కుమార్తెకు ఇంకేమైనా అవసరమైతే షమీ అందించాలి. మధ్యంతర ఉత్తర్వుల్లోని ప్రధాన దరఖాస్తును ట్రయల్ కోర్టు ఆరు నెలల్లో పరిష్కరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో భరణంపై విచారణ ముగిసేనాటికి ఇప్పుడున్న రూ. 4 లక్షలను రూ. 6 లక్షల వరకు పెంచే అవకాశం లేకపోలేదు. హసీన్ తన భరణ దరఖాస్తులో రూ. 10 లక్షల వరకు క్లెయిమ్ చేశారు” అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment