“దేశానికే తొలి ప్రాధాన్యం”..కేఎల్ రాహుల్‌పై ప్రశంసలు

"దేశానికే తొలి ప్రాధాన్యం"..కేఎల్ రాహుల్‌పై ప్రశంసలు

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్ తన వ్యక్తిగత జీవితం కంటే దేశానికి, క్రికెట్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడని కొనియాడాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్టులో ఒక సీనియర్ బ్యాటర్ గా రాహుల్ తన పాత్రను అద్భుతంగా పోషించాడని బదానీ అన్నారు.

“నాకు దేశమే ముఖ్యం”
హేమంగ్ బదానీ మాట్లాడుతూ, “ఇంగ్లాండ్‌కు బయలుదేరే ముందు కేఎల్ రాహుల్ నాతో మాట్లాడాడు. ‘నేను భారత జట్టు కంటే ముందుగా ఇంగ్లాండ్‌కు వెళ్లాలనుకుంటున్నాను. టెస్ట్ సిరీస్ కంటే ముందు సన్నాహక మ్యాచ్ లు ఆడాలనుకుంటున్నాను. నాకు వ్యక్తిగత జీవితం కంటే దేశమే ముఖ్యం’ అని రాహుల్ నాతో చెప్పాడు. రాహుల్ అలా చెప్పడం నిజంగా గొప్ప విషయం. మొదటి టెస్టులో ఒక సీనియర్ బ్యాటర్ గా అతడు తన పాత్రను సమర్థవంతంగా పోషించాడు” అని తెలిపారు.

కుటుంబం కంటే జట్టుకే ప్రాధాన్యం
గత మార్చిలో రాహుల్ సతీమణి అతియా శెట్టి మొదటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుటుంబంతో సమయం గడపడాని కంటే భారత జట్టుకు ఆడటానికే రాహుల్ ప్రాధాన్యం ఇచ్చాడు. లీడ్స్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 42 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 137 పరుగులు చేసి రాహుల్ తన నిబద్ధతను చాటుకున్నాడు. రాహుల్ దేశం పట్ల చూపిన ఈ అంకితభావం క్రికెట్ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment