వైసీపీ కార్య‌క‌ర్త మృతి.. సీసీ ఫుటేజీలో సంచ‌ల‌న నిజాలు

వైసీపీ కార్య‌క‌ర్త మృతి.. సీసీ ఫుటేజీలో సంచ‌ల‌న నిజాలు

మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) రెంట‌పాళ్ల ప‌ర్య‌ట‌నలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. అస్వ‌స్థ‌త‌కు గురైన ఆ పార్టీ కార్య‌క‌ర్త జ‌య‌వ‌ర్ధ‌న్‌రెడ్డి (Jayavardhan Reddy) ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయి మృతిచెందాడు (Died). ఈ ఘ‌ట‌న‌పై వైసీపీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తూ వారి పార్టీ కార్య‌క‌ర్త ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి కార్య‌క‌ర్త భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించింది. అయితే జ‌గ‌న్‌ పర్యటనలపై అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), దానికి అనుకూల మీడియా విషపూరిత ప్రచారం చేస్తోందని వైసీపీ తీవ్రంగా మండిపడింది. త‌మ పార్టీ కార్య‌క‌ర్త చావుపై కూడా దుష్ప్ర‌చారానికి తెగ‌బ‌డుతోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

సత్తెనపల్లి (Sattenapalli)లో జరిగిన ఒక ఘటనను వక్రీకరిస్తూ, తొక్కిసలాటలో ఒకరు మృతి చెందినట్లు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని, నిజానికి జయవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి అస్వస్థత కారణంగా మృతి చెందారని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. జగన్ పర్యటనకు ప్రజల నుండి లభిస్తున్న విశేష ఆదరణను చూసి ఓర్వలేక, తెలుగుదేశం పార్టీ మరియు దాని అనుకూల మీడియా (ఎల్లో మీడియా) పచ్చి అబద్ధాలను వల్లెవేస్తున్నారని వైసీపీ ఆరోపించింది.

ఘటన వివరాలను వెల్లడిస్తూ, సత్తెనపల్లిలో జగన్ ర్యాలీలో పాల్గొన్న జయవర్ధన్ రెడ్డి అలసటకు గురై ఒక షాపు ఎదుట కూర్చున్న సీసీ కెమెరా ఫుటేజీ (CCTV Camera Footage )ని విడుద‌ల చేసింది. ఫుటేజీలో జ‌య‌వ‌ర్ధ‌న్‌రెడ్డి (Jayavardhan Reddy) షాపు ముందు కూర్చొని, కొద్దిసేపటి తర్వాత ఆయన లేవబోయి కుప్పకూలారని, వెంటనే స్థానికులు బైకుపై ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స సమయంలో ఆయన మృతి చెందారని వైసీపీ వివరించారు. ఈ ఘటనను తొక్కిసలాటగా వ‌క్రీక‌రిస్తూ తమ కార్యకర్త మృతిపై దుష్ప్రచారం చేయడం దారుణమని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక వ్యక్తి మృతిని రాజకీయం చేయడం నీచమైన చర్య అని, ఇలాంటి దుష్ప్రచారాలను ప్రజలు విశ్వసించవద్దని వైసీపీ కోరింది. జగన్ పర్యటనలు ప్రజల మధ్య సానుకూల సందేశాన్ని చేరవేస్తున్నాయని, దీనిని అడ్డుకోవడానికి కూటమి పార్టీలు ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయని వైసీపీ నేతలు పేర్కొన్నారు. అయితే వైసీపీ విడుద‌ల చేసిన సీసీ ఫుటేజీ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment