Plane Crash : ‘ట్రాఫిక్ జామ్ నా ప్రాణాలను కాపాడింది!’

Plane Crash : 'ట్రాఫిక్ జామ్ నా ప్రాణాలను కాపాడింది!'

అందరూ చెబుతున్నట్లు “ఆలస్యం.. అమృతం, విషం” అన్నది ఎంత సత్యమో ఈ సంఘటన ద్వారా మరింత బోధపడుతుంది. గుజరాత్‌ (Gujarat’s)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదం (Airplane Accident) దేశాన్ని విషాదంలోకి నెట్టేసింది. ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) AI171 లండన్‌ (London) గాట్విక్‌ (Gatwick)కు బయలుదేరిన కొద్ది సేపట్లోనే విమానాశ్రయం సమీపంలోని నివాస ప్రాంతంపై కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం ఒక‌రు మిన‌హా ప్ర‌యాణికులు, ఫ్లైట్ సిబ్బంది మొత్తం ప్రాణాలు కోల్పోయారు.

ఆమె బతికింది.. ఎందుకంటే?
ఈ ప్రమాదం నుంచి మాత్రం భూమి చౌహాన్ (Bhumi Chouhan) అనే యువతి (Young Woman) అదృష్టవశాత్తూ బయటపడింది. లండన్‌ (London)లో నివసించే భూమి, తన భర్తతో కలిసి ఇండియా వెకేషన్‌ (India Vacation) కి వచ్చి తిరుగు ప్రయాణానికి విమాన టికెట్‌ బుక్ చేసుకుంది. కానీ, ఎయిర్‌పోర్టుకు వస్తుండగా ఎదురైన ట్రాఫిక్ జామ్ (Traffic Jam) కారణంగా ఆమెకు పది నిమిషాల ఆలస్యం అయింది. ఈ ఆలస్యం వల్లే ఆమె ఆ విమానాన్ని మిస్సయ్యింది. క్షణాల్లో విమానం టేకాఫ్‌ అయిన వెంటనే కూలిపోవడం చూసిన ఆమె, సోషల్ మీడియా వేదికగా “దేవుడే కాపాడాడు” (“God Saved Me) అంటూ భావోద్వేగంగా స్పందించింది.

దేవుడి దయగా భావిస్తున్న భూమి
భూమి తన భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. “ఒకవైపు విమానం మిస్సైందని బాధపడుతున్నా, కొన్ని నిమిషాల్లోనే జరిగిన ప్రమాదం నా హృదయాన్ని క‌ల‌చివేసింది. దేవుడే నాకు కొత్త జీవితం (New Life) ఇచ్చాడు.” అని పోస్ట్ చేసింది. విమాన ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన ర‌మేష్ అనే వ్య‌క్తి కూడా తాను ఆ ప్ర‌మాదం నుంచి ఎలా త‌ప్పించుకున్నారో అంతా ఆశ్చ‌ర్యంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment