హైకోర్టు మెట్లు ఎక్కిన‌ ఆర్సీబీ యాజమాన్యం

హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ యాజమాన్యం

18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న “రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) (RCB)” కు ఊహించని షాక్ తగిలింది. ఎన్నో ఏళ్ల తర్వాత ఐపీఎల్‌ టైటిల్ (IPL Title) గెలుచుకోవడంతో, బెంగళూరు నగరంలో విక్టరీ పరేడ్తో పాటు చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium)లో గ్రాండ్ సెలబ్రేషన్‌కు ప్లాన్ చేశారు. అయితే, ఈ విజయోత్సవ వేడుకలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో ఆర్సీబీపై ఎఫ్ఐఆర్(FIR) నమోదు కాగా, కొందరిని అరెస్ట్ కూడా చేశారు.

ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో, ఆర్సీబీ యాజమాన్యం (RCB Management) కర్ణాటక హైకోర్టు (Karnataka High Court)ను ఆశ్రయించింది. తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. తమను తప్పుడు కేసులో ఇరికించారని ఆర్సీబీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

మరోవైపు, ఈ ఈవెంట్‌ను నిర్వహించిన డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్ (DNA Entertainment Pvt Ltd) కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమపై నమోదైన కేసుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. తొక్కిసలాట ఘటనపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment