అసిస్టెంట్ డైరెక్టర్‌గా స్టార్ హీరోయిన్ కూతురు

అసిస్టెంట్ డైరెక్టర్‌గా స్టార్ హీరోయిన్ కూతురు

Summarize with AI

కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా, మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం థగ్ లైఫ్ (Thug Life) జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిశ్ర‌మ స్పంద‌న‌ను మూట‌గ‌ట్టుకుంది. ఈ సినిమాలో శింబు (Simbu), త్రిష (Trisha), అభిరామి (Abhirami), ప్రకాష్ వర్మ (Prakash Varma) కీలక పాత్రలు పోషించగా, ఏఆర్ రెహమాన్ (A.R Rahman) సంగీతం సమకూర్చారు. అయితే, ఈ చిత్రానికి ఓ స్టార్ హీరోయిన్ ( Star Heroine) కూతురు అసిస్టెంట్ డైరెక్టర్‌ (Assistant Director)గా పనిచేసిందని తెలుసా? ఆమె ఎవరో మీకు తెలియాలంటే…

కమల్-మణిరత్నం హిట్ కాంబో
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సంచలన విజయం సాధించిన నాయగన్ తర్వాత దాదాపు 30 ఏళ్లకు కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో థగ్ లైఫ్ రూపొందింది. ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను రేకెత్తించింది. తమిళం, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా, మణిరత్నం మార్క్ కొంత మిస్ అయినప్పటికీ, కమల్, త్రిష, శింబుల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు స్టార్ హీరోయిన్ ఖుష్బూ (Khushbu) చిన్న కూతురు (Younger Daughter) అనందిత అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించింది.

ఖుష్బూ కూతురు అనందిత
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందిన ఖుష్బూ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో చిరంజీవి, వెంకటేశ్, రజినీకాంత్, కమల్ హాసన్, ప్రభు, విజయ్ కాంత్ వంటి స్టార్ హీరోలతో జోడీ కట్టింది. కెరీర్ ఉచ్ఛస్థితిలో ఉండగానే డైరెక్టర్ సుందర్‌ను వివాహం చేసుకున్న ఖుష్బూ, ప్రస్తుతం సహాయ నటిగా తల్లి, అత్త పాత్రల్లో కనిపిస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు—అవంతిక, అనందిత. అవంతిక విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తుండగా, అనందిత మేకప్, బ్యూటీ రంగంలో రాణిస్తూ, సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

అనందిత సినీ ప్రస్థానం
కొన్నాళ్లుగా మణిరత్నం వద్ద సహాయ దర్శకురాలిగా పనిచేస్తున్న అనందిత, థగ్ లైఫ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించింది. ఆమె కాలు ఫ్రాక్చర్ కావడంతో పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయినప్పటికీ, కొంత కాలం ఈ ప్రాజెక్ట్‌లో భాగమైంది. ఈ సందర్భంగా ఖుష్బూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అనందిత పేరు సినిమా క్రెడిట్స్‌లో కనిపించిన ఫోటోను షేర్ చేస్తూ గర్వంగా రాసుకొచ్చింది: “ఒక తల్లిగా, నా కూతురు మణిరత్నం శిష్యురాలిగా థగ్ లైఫ్ సినిమాకు పనిచేయడం నన్ను ఎంతో ఆనందపరిచింది. కాలు ఫ్రాక్చర్ కారణంగా ఆమె పూర్తిగా పనిచేయలేకపోయినా, మణిరత్నం వద్ద నేర్చుకున్న జ్ఞానం ఆమె జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. సినిమా క్రెడిట్స్‌లో అనందిత పేరును చేర్చిన మణిరత్నం గొప్ప మనసుకు కృతజ్ఞతలు.”

Join WhatsApp

Join Now

Leave a Comment