దేశం (Country)లో మళ్లీ కరోనా (Corona) విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజా వివరాల ప్రకారం దేశంలో యాక్టివ్ కేసులు 3,961కు చేరగా, ఢిల్లీలో ఒక్క రోజులోనే 47 కొత్త కేసులు నమోదవ్వగా, దేశంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు వేల (Four Thousand) మార్క్‌ను దాటింది. ప్రస్తుతం రాష్ట్రాల వారీగా చూస్తే, కేరళ (Kerala)లో అత్యధికంగా 1,435 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ గణాంకాలు అక్కడ వైరస్ వ్యాప్తి తీవ్రతను వెల్లడిస్తున్నాయి.
గత 24 గంటల్లో కరోనా కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో ఢిల్లీ (Delhi), తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala), మహారాష్ట్ర (Maharashtra)లలో ఒక్కో మరణం చొప్పున నమోదైంది. ముఖ్యంగా ఢిల్లీలో 22 ఏళ్ల యువతి (Young Woman) మృతి (Death) చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ తాజా మరణాలతో కలిపి ఈ కరోనా ఉధృతి సందర్భంగా దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 32కి చేరింది. గత సంవత్సరం నాటికే కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్లీ వణికిస్తోంది.
WHO గుర్తించిన కొత్త వేరియంట్
ఇదిలా ఉండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారతదేశంలో కొత్త కరోనా సబ్ వేరియంట్‌ను గుర్తించింది. ఇది NB1.8.1 అనే వేరియంట్. ఈ కొత్త స్ట్రెయిన్‌పై ప్రస్తుతం లోతుగా పరిశోధనలు జరుగుతున్నాయి. దీని వ్యాప్తి, తీవ్రతపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచడం వంటి నియమాలు పాటించడం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు.